ప్రకృతిలో ఇదో వింత: ఫ్లెమింగో బిడ్డకు పాలు ఎలా ఇస్తుందో చూడండీ..

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 09:07 AM IST
ప్రకృతిలో ఇదో వింత: ఫ్లెమింగో బిడ్డకు పాలు ఎలా ఇస్తుందో చూడండీ..

Updated On : February 20, 2020 / 9:07 AM IST

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ లో ఓ అద్భుతమైన వీడియోని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన వాళ్లంతా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ వీడియోలో రెండు ఫ్లెమింగోలు కొట్టుకుంటుంటే అందులో ఒకదానికి బ్లడ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. 

ఈ వీడియో చూసి నెటిజన్లంతా.. పాపం ఆ ఫ్లెమింగోని  మరో ఫ్లెమింగో రక్తం వచ్చేలా ఎలా పొడిచేస్తుందో అని బాధపడుతున్నారు. కానీ, ఈ వీడియోని అప్‌లోడ్ చేసిన IFS అధికారి పర్వీన్ కస్వాన్ అసలు విషయం చెప్పారు. అదేంటంటే.. ఈ ఫ్లెమింగోలు పొడుచుకోవట్లేదు, అసలు ఇది ఫైటింగే కాదని చెప్పారు. ఈ రెండు ఫ్లెమింగోలూ… తమ పిల్లకు క్రాప్ మిల్క్ ఇస్తున్నాయి అని తెలిపారు. 

ఆశ్చర్యంగా ఉంది కదు, సాధారణంగా పాలు అంటే తెలుపు రంగులో ఉంటాయి కద అనుకుంటున్నారా.. కానీ ఫ్లెమింగో పక్షులకు పాలు అనేవి ఇలా రెడ్ కలర్‌ లో ఉంటాయట. వీటిని క్రాప్ మిల్క్ అంటారట. తమ పిల్లలకు పాలిచ్చే ప్రతీసారి ఫ్లెమింగోలు ఇలా చేస్తాయని పర్వీన్ కస్వాన్ తెలిపారు. ఈ క్రాప్ మిల్క్‌లో ప్రోటీన్, ఫ్యాట్ ఉండే కణాలుంటాయి. జీర్ణం కాకముందు ఫుడ్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఈ క్రాప్ మిల్క్ కూడా స్టోర్ అవుతాయట. దాన్ని ఫ్లెమింగోలు పిల్లలకు పట్టిస్తాయట.