మిరాకిల్ ఎస్కేప్ : ఆవును తప్పించబోయి.. లారీ గ్రేట్ స్టంట్

ఆవు సేఫ్ గా వెళ్లిపోయింది. ట్యాంకర్ డ్రైవర్ హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. గ్రేట్ మిరాకిల్ ఎస్కేప్‌గా ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇంకా మేం చెప్పటం.. మీ చదవటం ఆపేసి.. వాచ్ దిస్ వీడియో.. 

మిరాకిల్ ఎస్కేప్ : ఆవును తప్పించబోయి.. లారీ గ్రేట్ స్టంట్

ఆవు సేఫ్ గా వెళ్లిపోయింది. ట్యాంకర్ డ్రైవర్ హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. గ్రేట్ మిరాకిల్ ఎస్కేప్‌గా ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇంకా మేం చెప్పటం.. మీ చదవటం ఆపేసి.. వాచ్ దిస్ వీడియో.. 

అప్పట్లో యాక్షన్ సీన్ అంటే హాలీవుడ్ సినిమాలు గుర్తుకొచ్చేవి.. వాటికి ఏ మాత్రం తీసిపోకుండా ఇప్పుడు బాలీవుడ్ మూవీస్ బుర్రలో గింగరాలు తిరుగుతున్నాయి. బాహుబలి తర్వాత పరిస్థితి ఇది. లేటెస్ట్‌గా ప్రభాస్ సాహో మూవీ యాక్షన్ సీన్స్‌ను కంపార్ చేస్తుండటం విశేషం. ఎందుకీ కంపారిజేషన్ అంటున్నారా.. మిరాకిల్ ఎస్కేప్‌గా జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్ రాష్ట్రం జునగఢ్ ప్రాంతం. రూరల్ ఏరియా. నిర్మానుష్యమైన రోడ్డు. ఓ పాల ట్యాంకర్ స్పీడ్‌గా దూసుకొస్తుంది. 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. జస్ట్ 500 మీటర్ల దూరంలో రోడ్డుపై ఓ ఆవు నిదానంగా రోడ్డు దాటుతుంది. దాన్ని చూసిన డ్రైవర్ హారన్ కంటిన్యూగా కొడుతున్నాడు. ఆవుకు పట్టించుకోకుండా దాదాపు రోడ్డు మధ్య వరకూ వచ్చేసింది. ట్యాంకర్ దగ్గరగా వచ్చాక తెలిసింది ఆవుకి. వెంటనే వెనక్కితిరిగి పరుగు లంకించుకుంది. ముందుకు వెళ్లాల్సిన ఆవు.. సడెన్ గా వెనక్కి తిరిగింది. 

హఠాత్తుగా లారీని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవటం సాధ్యం కాలేదు. అంతే డ్రైవర్ సెడన్ బ్రేక్ వేశాడు. ఎంతలా ఉంటే.. బ్రేక్ పై కాలు వేసి.. నిలబడ్డాడు. అంతే ట్యాంకర్ 180 డిగ్రీలు తిరిగింది. ట్యాంకర్ అమాంతం యూటర్న్ తీసుకున్నట్లు తిరిగిపోయింది. ఆవు సేఫ్ గా వెళ్లిపోయింది. ట్యాంకర్ డ్రైవర్ హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. గ్రేట్ మిరాకిల్ ఎస్కేప్‌గా ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇంకా మేం చెప్పటం.. మీ చదవటం ఆపేసి.. వాచ్ దిస్ వీడియో..