మరో అల్పపీడనం.. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

మరో అల్పపీడనం.. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Telangana Rains : తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో పలు జిల్లాలోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Also Read : గుడ్‌న్యూస్.. పంటల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం