Rains In Telangana : తెలంగాణాలో ఈరోజు,రేపు వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఈరోజు కేరళ మొత్తం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Rains In Telangana
Rains In Telangana : నైరుతి రుతుపవనాలు ఈరోజు కేరళ మొత్తం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల రెండు రోజుల్లో కర్ణాటకలోని మరి కొన్ని ప్రాంతాలకి, కొంకన్ & గోవా లోని కొన్ని బాగాలకి , తమిళనాడులోని మరి కొన్ని భాగలకి, మొత్తము నైరుతి బంగాళాఖాతంకి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని భాగాలకి , ఈశాన్య బంగాళాఖాతంలోనికి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
తెలంగాణలో వాయువ్య దిశనుంచి కింది స్ధాయి గాలులు రాష్ట్రంలోకి వీస్తున్నాయి. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తెలంగాణాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం అక్కడక్కడా వచ్చే అవకాశం ఉంది. ఆసమయంసలో గంటకు 40 నుండి 50 కి మీ వేగంతోఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షంలు అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉందని వివరించారు.
Also Read : Guntur : గుంటూరులో ప్రేమోన్మాది ఘాతకం- తల్లీ,కూతురుపై బ్లేడ్‌తో దాడి