Viral Video: వెడ్డింగ్ ఫొటో షూట్‌లోకి దూసుకొచ్చిన కోతి.. తర్వాత ఏం జరిగిందంటే.. ఆసక్తికర వీడియో
వెడ్డింగ్ ఫొటో షూట్స్ సందర్భంగా కొన్ని సరదా సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఒక వెడ్డింగ్ ఫొటో షూట్‌కు సంబంధించిన ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

Viral Video: ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్స్, వెడ్డింగ్ ఫొటో షూట్స్ చాలా కామన్. అయితే, ఈ ఫొటో షూట్స్ సందర్భంగా కొన్ని సరదా సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఒక వెడ్డింగ్ ఫొటో షూట్‌కు సంబంధించిన ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. ఈ వీడియో ప్రకారం ఒక జంట పెళ్లి దుస్తుల్లో ముస్తాబై ఫొటో షూట్ చేయించుకుంటోంది. ఒక ప్రైవేట్ పార్కులోని చిన్న బ్రిడ్జిపై ఫొటో షూట్ చేయించుకుంటుండగా ఒక కోతి ఉన్నట్లుండి వాళ్ల దగ్గరికొచ్చింది. వీపుపై బిడ్డను ఎత్తుకున్న ఆ కోతి, పెళ్లి కొడుకును పట్టుకుని అతడిపైకి ఎక్కింది. తర్వాత కొద్దిసేపు ఆ జంట కోతితో ఆడుకున్నారు. ఈ దృశ్యాన్ని కూడా కెమెరామెన్స్ తమ కెమెరాలో బంధించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆ జంట తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో తమకెంతో నచ్చినట్లు చెప్పింది. దీన్ని వీడియో తీసినందుకు థాంక్స్ చెప్పింది. నిజంగా ఈ ఘటన ఆ కొత్తం జంటకు ఒక మంచి మెమరీగా నిలుస్తుంది.
View this post on Instagram