Viral Video: సముద్రంలో కెమెరాను మింగి.. మళ్ళీ బయటకు వదిలిన టైగర్ షార్క్ చేప

టైగర్ షార్క్ చేప కెమెరాను మింగడంతో ఆ చేప పళ్లు, గొంతు, లోపలి భాగం కెమెరాలో స్పష్టంగా కనపడింది. ఆ కెమెరాను మళ్ళీ వదిలేసిన తర్వాత ఈదుకుంటూ వెనక్కి వెళ్లిపోయింది. టైగర్ షార్క్ చేప లోపలి భాగాలు అనూహ్యంగా కనపడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Viral Video: సముద్రంలో కెమెరాను మింగి.. మళ్ళీ బయటకు వదిలిన టైగర్ షార్క్ చేప

Viral Video: సముద్ర జీవుల దృశ్యాలను రికార్డు చేయడానికి ఓ వ్యక్తి కెమెరా పట్టుకుని నీటి అడుగు భాగంలో ఈదుతున్నాడు. ఇంతలో ఓ టైగర్ షార్క్ చేప అతడి వైపునకు వచ్చి కెమెరాను మింగేసింది. అనంతరం మళ్ళీ దాన్ని బయటకు ఉంచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ షార్క్ చేప కెమెరాను మింగి మళ్ళీ వదిలేయడంతో స్కూబా డైవర్ తన కెమెరాను నష్టపోలేదు.

అంతేగాక, టైగర్ షార్క్ చేప కెమెరాను మింగడంతో ఆ చేప పళ్లు, గొంతు, లోపలి భాగం కెమెరాలో స్పష్టంగా కనపడింది. ఆ కెమెరాను మళ్ళీ వదిలేసిన తర్వాత ఈదుకుంటూ వెనక్కి వెళ్లిపోయింది. టైగర్ షార్క్ చేప లోపలి భాగాలు అనూహ్యంగా కనపడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

31 Famous Brands: మనం రోజూ వాడే ఈ 31 ఫేమస్ బ్రాండ్ల పూర్తి పేర్లు మీకు తెలుసా?

కెమెరాను ఆ చేప మింగడం ఒక ఎత్తయితే, దాన్ని మళ్ళీ బయటకు ఉంచేయడం మరో ఎత్తు. ఈ వీడియోను ఓ వ్యక్తి పోస్టు చేసిన కాసేపటికే బాగా వైరల్ అయింది. కెమెరాను షార్క్ చేప మళ్ళీ బయటకు ఉంచేయకపోతే స్కూబా డైవర్ అంతవరకు పడ్డ శ్రమంతా వృథా అయ్యేదని కొందరు కామెంట్లు చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..