World Environment Day 2023 : ప్లాస్టిక్ బాటిల్స్‌తో భారీ తాబేలు .. పర్యావరణం కోసం సందేశం..

ప్లాస్టిక్.. ప్లాస్టిక్ .. ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ భూతం వల్ల ఎన్నో జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఎన్నీ వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ప్లాస్టిక్ బాటిల్స్ తో రూపొందించిన అతి పెద్ద తేబేలు సముద్రం ఒడ్డున ఆకట్టుకుంటోంది.

World Environment Day 2023 : ప్లాస్టిక్ బాటిల్స్‌తో భారీ తాబేలు .. పర్యావరణం కోసం సందేశం..

Sudarsan Pattnaik ‘biggest sand turtle’

World Environment Day 2023 : జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రతీ ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాడిన రోజు. పర్యావరణానికి హాని చేసేవి చేయకూడదని.. దాని కోసం ఏం చేయాలో అవగాహన కల్పించే రోజు. ఎక్కడ చూసిన ప్లాస్టిక్.. ప్లాస్టిక్ .. ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ భూతం వల్ల ఎన్నో జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఎన్నీ వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి.

 

నీరు, మట్టిని కలుషితం చేస్తూ మనుషులు, జంతువుల అనారోగ్యాలకు కారణం అవుతున్న ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట పడటంలేదు. ఎంతో ముప్పు తెచ్చిపెడుతున్న ప్లాస్టిక్ వాడకం వద్దంటూ ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ఈ పొల్యూషన్‌కి అడ్డుకట్ట పడట్లేదు. ఎంతోమంది పర్యావరణవేత్తలు ఎన్నో హెచ్చరికలు చేసినా ఫలితంలేకుండాపోతోంది. ఇది ఏ ఒక్కరి కోసమో కాదు మానవాళి కోసం..ఈ భూమ్మీద నివసించే ప్రతీ జీవి మనుగడ కోసం ప్రతీ ఒక్కరు బాధ్యత పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం..

World Environment Day 2023 : ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొత్త థీమ్

ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ప్లాస్టిక్ బాటిల్స్ తో ఓ పేద్ద తాబేలు బొమ్మను తీర్చిదిద్దారు. ఒడిశాలోని పూరీ బీచ్ లో ప్లాస్టిక్ బాటిల్స్ తో అతి పెద్ద తాబేలు బొమ్మను రూపొందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సుదర్శన్ పట్నాయక్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఇసుక తాబేలును 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.#BeatPlasticPollution అనే సందేశంతో పట్నాయక్ ట్వీట్ చేశారు.