ఇదొక రికార్డు : తూర్పుగోదావరిలో 44 వేల 198 మందికి జాబ్స్ – సీఎం జగన్

  • Edited By: madhu , October 2, 2019 / 06:54 AM IST
ఇదొక రికార్డు : తూర్పుగోదావరిలో 44 వేల 198 మందికి జాబ్స్ – సీఎం జగన్

తూర్పుగోదావరి జిల్లాలో 44 వేల 198 మంది జాబ్స్ రావడం ఒక చరిత్ర..ఒక రికార్డు అన్నారు సీఎం జగన్. కనివినీ ఎరుగని విధంగా ఉద్యోగ నియమకాలు చేస్తున్నామని, పరిపాలనలో అవినీతి లేకుండా చేయాలనే అనే తపనతో తాము గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్టోబర్ 02వ తేదీ జిల్లాలోని కరపలో సచివాలయ ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం నూతన ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ…ప్రతి గ్రామానికి 10 నుంచి 12 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా..50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ఉద్యోగం ఇవ్వడం జరిగిందన్నారు. కేవలం నాలుగు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమమన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 1271 గ్రామ సచివాలయాలు..పట్టణ సచివాలయాలతో కలుపుకుంటే..15 వందల 87 సచివాలయాల్లో 13 వేల 640 మందికి కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇది ఒక రికార్డు అన్నారు.

30 వేల 558 మందికి గ్రామ వాలంటరీలుగా ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఒక్క నాలుగు నెలల కాలంలో జిల్లాలో 44 వేల 198 మందికి జాబ్స్ వచ్చాయన్నారు సీఎం జగన్. ఒక రికార్డు..ఒక చరిత్ర అన్నారు. 35 ప్రభుత్వ శాఖలకు సంబంధఇంచి 500 సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇవన్నీ జనవరి 01 నుంచి ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు సీఎం జగన్. 
Read More : తండ్రి వైఎస్ చదివిస్తే..తనయుడు జగన్ జాబ్ ఇచ్చారు