ఔట్ సోర్సింగ్ పేరుతో చంద్రబాబు దోపిడీ..బంధువులకే కాంట్రాక్టులు : సీఎం జగన్

  • Published By: veegamteam ,Published On : December 17, 2019 / 05:42 AM IST
ఔట్ సోర్సింగ్ పేరుతో చంద్రబాబు దోపిడీ..బంధువులకే కాంట్రాక్టులు : సీఎం జగన్

చంద్రబాబు బంధువులకు మాత్రమే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్ని కట్టబెట్టారని సీఎం జగన్ విమర్శించారు. అసెంబ్లీలో ఈరోజు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వ హాయంలో ఔట్ సోర్సింగ్ ఉగ్యోగాల పేరుతో లంచాలు ఇష్టానుసారంగా తిన్నారనీ..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో కూడా టీడీపీ నాయకులు లంచాలు తీసుకున్నారని ఆరోపించారు.

కానీ తమ ప్రభుత్వం వచ్చాక లంచాలు అనే మాటే లేదనీ..వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందకు..అవినీతి అనే మాట వినిపించకుండా పారదర్శకంగా పాలనకోసం కృషి చేస్తున్నామన్నారు.   ఔట్ సోర్సింగ్ పేరుతో చంద్రబాబు తన బంధువులకు దోచిపెట్టారని ఆరోపించారు. కానీ తాము మాత్రం అవినీతికి తావు లేకుండా ఉద్యోగులకు పూర్తిస్థాయి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని..ఇది టీడీపీ నేతలకు కంటకింపుగా ఉందనీ అందుకే బురద చల్లుతున్నారని అన్నారు.  

ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో బీసీ,ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 50 శాతం ఉగ్యోగాలు కల్పిస్తున్నామని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తాను ఇచ్చిన మాటను నలిబెట్టకునేలా వారికి ప్రాధాన్యత కల్పించామనీ..ఇటువంటివారిని కూడా ప్రతిపక్షం విమర్శించటం విచారకరమని అన్నారు. ఇంతకంటే పారదర్శకంగా..ఇంతకంటే గొప్ప పాలన ఎక్కడా లేదని సీఎం జగన్ అన్నారు.  

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం ఇవ్వాలన్నా..ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా నాయకుల చేతిలో లంచాలు పడందే చేతికి డబ్బులు రాని పరిస్థితి ఉండేదనీ..సభలో ఇప్పుడన్నీ అబద్దాలు చెబుతున్నారనీ ఇది సిగ్గుచేటని సీఎం జగన్ అన్నారు. ఈ లంచాల బెడద ఉండకూడనే ఉద్ధేశ్యంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసామని అన్నారు.