Viral Pics: మహిళల దుస్తులు అమ్మే దుకాణాల్లో బొమ్మల ముఖాలు కనపడకుండా ఆంక్షలు

షాపింగ్ మాళ్లలో ఉండే బొమ్మలకు వేసే దుస్తులపై ఆంక్షలు విధించడం గమనార్హం. మహిళల దుస్తులు అమ్మే దుకాణాల్లో ఉండే బొమ్మల ముఖాలు కనపడడానికి వీల్లేదని తాలిబన్లు చెప్పారు. దీంతో ఆ బొమ్మల ముఖాలను ప్లాస్టిక్ బ్యాగులు, అల్యూమినియం రేకులతో దుకాణదారులు కప్పేశారు.

Viral Pics: మహిళల దుస్తులు అమ్మే దుకాణాల్లో బొమ్మల ముఖాలు కనపడకుండా ఆంక్షలు

Taliban rule

Viral Pics: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం అనేక విచిత్ర ఆంక్షలను విధిస్తోంది. అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిన అనంతరం తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహిళలు, బాలికలపై ఎన్నో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాలిక‌లు మాధ్యమిక విద్యను అభ్య‌సించ‌కుండా ఆంక్షలు విధించింది.

ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో మ‌హిళ‌ల నాయ‌క‌త్వం లేకుండా చేసింది. పురుషుడి తోడు లేకుండా మ‌హిళ‌లు ప్ర‌యాణాలు చేయ‌డానికి వీల్లేదు. దీంతో మహిళలంటే బొమ్మల్లా తాలిబన్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా తాలిబన్లు మరో కొత్త ఆంక్షలు విధించారు.


ఈ సారి షాపింగ్ మాళ్లలో ఉండే బొమ్మలకు వేసే దుస్తులపై ఆంక్షలు విధించడం గమనార్హం. మహిళల దుస్తులు అమ్మే దుకాణాల్లో ఉండే బొమ్మల ముఖాలు కనపడడానికి వీల్లేదని తాలిబన్లు చెప్పారు. దీంతో ఆ బొమ్మల ముఖాలను ప్లాస్టిక్ బ్యాగులు, అల్యూమినియం రేకులతో దుకాణదారులు కప్పేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, తాలిబ‌న్ ప్ర‌భుత్వ తీరుతో అఫ్గాన్ లోని అమ్మాయిల భ‌విష్య‌త్తు అంధ‌కారంలో పడే ప్ర‌మాదం ఉంద‌ని ఇప్పటికే పలు మాన‌వ హ‌క్కుల సంఘాలు హెచ్చరించాయి.

Earthquake In Argentina : అర్జెంటీనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.5గా నమోదు