గుంటూరు రైల్వే డివిజన్ లో e-office

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 10:26 AM IST
గుంటూరు రైల్వే డివిజన్ లో e-office

గుంటూరు రైల్వే డివిజన్ లో మొదటి e-office ప్రారంభమైంది. ఇది భారత రైల్వేలో మొట్టమొదటిది కావటం విశేషం. ప్రతి అధికారిక లావాదేవీలు e-office నుంచి జరగనున్నాయి. “ఇండియన్ రైల్వేస్ లో e-office రీతిలో రూపాంతరం చేసిన మొదటి డివిజన్,” అని డివిజనల్ రైల్వే మేనేజర్ VG భూమా తెలిపారు. 

 

ఆరు నెలల క్రితం భారతీయ రైలుమార్గాల వద్ద e-office ప్రాజెక్టును అమలు చేయడానికి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి)రైల్ టెల్ లతో రైల్వే బోర్డు ఒప్పందంపై సంతకాలు చేసింది. రైల్వేలకు అవసరమైన సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేసేందుకు ఎన్ఐసి అప్పగించినప్పటికీ..అమలు చేసే బాధ్యతను మాత్రం రైల్ టెల్ తీసుకుంది. సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్.సి.ఆర్)సికింద్రాబాద్ డివిజన్ నుండి ఇ-కార్యాలయ ప్రాజెక్టును ప్రారంభించాలని కోరుకున్నామని భూమా తెలిపారు. 

మొత్తం డేటాను సిద్ధం చేసి..మొదటిసారిగా గుంటూరు డివిజన్ లో e-office అమలు చేయటం సంతోషంగా ఉందన్నారు. కేవలం రెండు నెలల్లోనే దీన్ని అమలు చేశామన్నారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నల్గొండ జిల్లాల వ్యాప్తంగా అత్యున్నత స్థాయి అధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకూ e-office అమలుకు 4,000 సిబ్బందికి ట్రైనింగ్ అయి ఉన్నారని తెలిపారు.ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా మాత్రమే ప్రతి అధికారి కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుందన్నారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి చర్చ..అఫిషియల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ డెవలప్ మెంట్ వంటివన్నీ e-office ప్రాజెక్టు ద్వారా సీనియర్ అధికారులకు పంపించాల్సి ఉంటుందని డివిజనల్ రైల్వే మేనేజర్ VG భూమా తెలిపారు.