పోలవరం ప్రాజెక్ట్ కి మేఘా ఇంజినీరింగ్ భూమిపూజ

ఏపీ జీవనాడిగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఏపీ ప్రభుత్వం రీటెండరింగ్ నిర్వహించగా..

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 06:55 AM IST
పోలవరం ప్రాజెక్ట్ కి మేఘా ఇంజినీరింగ్ భూమిపూజ

ఏపీ జీవనాడిగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఏపీ ప్రభుత్వం రీటెండరింగ్ నిర్వహించగా..

ఏపీ జీవనాడిగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఏపీ ప్రభుత్వం రీటెండరింగ్ నిర్వహించగా.. మేఘా సంస్థ పనులు దక్కించుకుంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ పనులకి మేఘా ఇంజినీరింగ్ డీజీఎం సతీష్, పీఎం మురళి భూమి పూజ చేశారు. శుక్రవారం(నవంబర్ 1,2019) స్పిల్ వే దగ్గర గణపతి పూజ చేశారు. శనివారం(నవంబర్ 2,2019) నుంచి మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభించనుంది.

ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పోలవరం రివర్స్ టెండర్ ప్రక్రియలో.. పోలవరం ప్రధాన టెండర్ ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ.4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా.. మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ.4358 కోట్లకు కోట్ చేస్తూ టెండర్ దాఖలు చేసింది.

గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే 12.6 శాతం తక్కువకు మేఘా కోట్ చేసింది. దీంతో పోలవరం కాంట్రాక్టును మేఘా సంస్థ దక్కించుకుంది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణనలోకి తీసుకుని దాని ఆధారంగా అధికారులు బిడ్డింగ్ నిర్వహించారు.
 
రివర్స్‌ టెండరింగ్‌లో భాగంగా పోలవరం కాంట్రాక్టును రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తిరిగి టెండర్‌ను పిలిచింది. పోలవరం హెడ్‌ వర్క్స్‌లో మిగిలిపోయిన పనులతో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి రివర్స్ టెండర్‌ పిలిచింది. రీ టెండరింగ్‌తో రూ.628 కోట్లు ఆదా అయ్యిందని ప్రభుత్వం తెలిపింది.