ఎక్కువ మాట్లాడొద్దు.. తాట తీస్తా.. మంత్రి వెల్లంపల్లి బెదరింపులు

10TV Telugu News

సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన బాధితులతో దురుసుగా ప్రవర్తించి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఐదేళ్లు అధికారంలో ఉంది మీరే కదా? అప్పుడేం చేయకుండా ఇప్పుడు వినతి పత్రం ఇస్తారా? అంటూ తీవ్రస్థాయిలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్లంపల్లి.

గత ఐదేళ్లలో మీరేమి పీకలేదు గానీ.. ఇప్పుడు మేము చేయాలా? అంటూ దురుసుగా ప్రవర్తించగా.. మంత్రి తీరుపై స్థానికులు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కారించాలని కోరితే మంత్రి వెల్లంపల్లి బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను చెప్పుకునేందుకు వచ్చిన బాధితులను హూంకరిస్తూ.. ఎత్తిపారేయండి అంటూ పోలీసులను ఆదేశించారు.

మంత్రి వెల్లంపల్లి తీరుపై సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు సమస్యలు తీరుస్తాం అంటూ మా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగిపోయారని, ఇప్పుడు మంత్రి అనే అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

10TV Telugu News