పాకిస్థాన్ లో మరుగుదొడ్డిగా వాడుతున్న 1000 ఏళ్ల నాటి హిందూ దేవాలయం..!!

  • Published By: nagamani ,Published On : July 26, 2020 / 12:57 PM IST
పాకిస్థాన్ లో మరుగుదొడ్డిగా వాడుతున్న 1000 ఏళ్ల నాటి హిందూ దేవాలయం..!!

దేవాలయం అంటే పవిత్రమైనది. అది ఏ మతం వారికైనాసరే. కానీ పవిత్రమైన దేవాలయాన్ని మరుగుదొడ్డిగా వాడుతున్న దారుణం గురించి బహుశా ఎవరూ విని ఉండరు. కానీ పాకిస్థాన్ లో ఇది జరుగుతోంది. పాకిస్తాన్‌లోని కరాచీలోని మనోరా ఐలాండ్ బీచ్‌లోని వరుణ్ దేవ్ మందిరాన్ని 16వ శ‌తాబ్దంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. అంటే ఈ దేవాలయానికి 1000 సంవత్సరాల చరిత్ర కలిగినంది. ఆనాటి హిందూ దేవాలయాన్ని అక్కడి వారు పబ్లిక్ టాయ్ లెట్ లా వాడుతున్నారు.

భోజోమ‌ల్ నాన్సీ భాటియా అన‌బ‌డే ఓ ధనవంతుడు ఈ వరుణ దేవాల‌యం ఉన్న ద్వీపాన్ని కొనుగోలు చేశాడ‌ని…ఆ ఆల‌యం అప్ప‌ట్లో భాటియా వంశ‌స్థుల చేతుల్లో సుర‌క్షితంగా ఉండేది. ఆతరువాత ఈ దేవాలయాన్ని 917-18వ సంవ‌త్స‌రంలో భాటియా వంశస్తులే పున‌ర్నిర్మించినట్లుగా తెలుస్తోంది.ఆల‌యం ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద గోడ‌ల‌పై సింధీ భాష‌లో కొన్ని వ్రాతలు రాయబడ్డాయి. భ్రియాకు చెందిన సేత్ హ‌ర్‌చంద్ మ‌ల్ ద‌యాల్ దాస్ జ్ఞాప‌కార్థం అనే వ్రాతలు ఉంటాయి. ఆ రాతల్లో ఉన్న భ్రియా అనే పద ఓ టౌన్ పేరు. పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రం ఖైర్‌పూర్‌లో ఈ భ్రియా టౌన్ ఉంది.

కాలక్రమేణా భాటియా వంశస్థుల చేతుల్లోంచి ఈ ఆలయం బాధ్యతలు చేజారిపోయాయి. దీనికి కారణాలు సరిగ్గా తెలీవు. దీంతో ప్ర‌స్తుతం ఆల‌య బాధ్య‌త‌ల‌ను పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ చూసుకుంటోంది. అయిన‌ప్ప‌టికీ ఆల‌యాన్ని ప‌రిర‌క్షించేందుకు పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
దీంతో వరుణ్ దేవాలయం గోడ‌లు, గ‌దులు శిథిలావ‌స్థ‌కు చేరుకున్నాయి. బీచ్‌కు వ‌చ్చే వారు ఈ ఆల‌యంలో ఉన్న గ‌దుల‌ను టాయిలెట్లుగా వాడ‌డం మొద‌లు పెట్టారు. 2008లో ఆల‌య ప‌రిర‌క్ష‌కుడు జీవ్‌రాజ్ ఆల‌య హ‌క్కులు ఎవ‌రికి ఉన్నాయో తెలుసుకునేందుకు అక్క‌డి మ‌నోరా కంటోన్మెంట్ బోర్డు (ఎంసీబీ)కి లేఖ రాశాడు. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ నేవీకి ఆల‌యం ఉన్న స్థ‌లం చెందుతుంద‌ని తేలింది.

ఇక ఆల‌యంలోకి అన్యులు ప్రవేశించికుండా ఉండే గేట్ల‌ను కూడా తీసేశారు. దీంతో ఎవ‌రు ప‌డితే వారు అందులోకి వెళ్ల‌డం మొద‌లైంది. ఎరికి ఇష్టమొచ్చినట్లుగా వారు వాడేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆల‌యం శిథిలావ‌స్థ‌కు కూడా చేరుకోవ‌డంతో.. ఆల‌య ప‌రిస్థితి మ‌రింత దుర్భ‌రంగా మారి…ఆల‌య శిఖ‌రం కూడా ఒక వైపుకు ఒరిగిపోయింది. పట్టించుకునేవారు లేక కారక్రమేణా గోడ‌ల‌న్నీధ్వంస‌మ‌య్యాయి. ఈ ఆల‌యంలో చివ‌రిసారిగా 1950ల‌లో పూజ‌లు జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తరువాత 1992లో ఈ ఆల‌యానికి సీల్ వేశారు. అప్ప‌టి నుంచి ఎటువంటి పూజలు జరగటంలేదురు సరికదా అంత పవిత్రమైన దేవాలయం కాస్తా మరుగుదొడ్డిగా మారిపోయింది. ఇది చాలా చాలా దురదృష్టకరం.

ఈ ఆల‌యం ప్రాంగ‌ణంలోనే మ‌రో రెండు చిన్న చిన్న జూలే లాల్‌, శివాల‌యాలు ఉండగా అవికూడా శిథిలావ‌స్థ‌కు చేరుకున్నాయి.1970ల నుంచి ఏదో నామకా చేసినట్లుగా చిన్న చిన్న రిపేర్ల‌ను చేస్తున్న‌ప్ప‌టికీ ఆల‌యం ఎప్ప‌టిక‌ప్పుడు ధ్వంస‌మ‌వుతూండటంతో రిపేర్లు చేయటం కూడా ఆపేసినట్లుగా తెలుస్తోంది. ఆ తరువాత ఎన్నో ఏళ్ల త‌రువాత యూఎస్ అంబాసిడ‌ర్స్ ఫండ్ ఫ‌ర్ క‌ల్చ‌ర‌ల్ ప్రిజ‌ర్వేష‌న్ వారు విరాళాలు ఇవ్వ‌డంతో ఆల‌యాన్ని ఎట్ట‌కేల‌కు పున‌రుద్ధ‌రించారు. పూర్తి స్థాయిలో మ‌ర‌మ్మ‌త్తులు చేశారు. ప‌లు ప‌నులు ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉన్నాయి.