Viral Video: ఇదేం సోడారా బాబు.. వైరల్ అవుతున్న ‘చీజ్ బ్లాస్ట్ సోడా’ వీడియో

కొత్త రకం టేస్ట్ అంటూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ క్రియేట్ చేస్తుంటారు. చాక్లెట్ ఆమ్లెట్, పిజ్జా వడాపావ్, ఫాంటా మ్యాగీ వంటి ఐటమ్స్ అలాంటివే. ఈ ఫుడ్స్ బాగున్నా.. లేకున్నా వైరల్ అవుతుంటాయి. వాటిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియలో ఒక విచిత్రమైన ఫుడ్ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: ఇదేం సోడారా బాబు.. వైరల్ అవుతున్న ‘చీజ్ బ్లాస్ట్ సోడా’ వీడియో

Viral Video: సోషల్ మీడియాలో భయంకరమైన ఫుడ్ వీడియోలు కనిపిస్తుంటాయి. కొత్త రకం టేస్ట్ అంటూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ క్రియేట్ చేస్తుంటారు. చాక్లెట్ ఆమ్లెట్, పిజ్జా వడాపావ్, ఫాంటా మ్యాగీ వంటి ఐటమ్స్ అలాంటివే. ఈ ఫుడ్స్ బాగున్నా.. లేకున్నా వైరల్ అవుతుంటాయి.

Shubman Gill: గిల్ టెస్టుల్లో పదివేల పరుగులు సాధిస్తాడు.. గిల్‌పై ప్రశంసలు కురిపించిన గవాస్కర్

వాటిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియలో ఒక విచిత్రమైన ఫుడ్ వీడియో వైరల్ అవుతోంది. అదే.. చీజ్ బ్లాస్ట్ సోడా. ఎవరైనా సాధారణంగా చీజ్‌ను డ్రింక్స్‌లో వాడరు. కానీ, గుజరాత్‌లోని, సూరత్‌లో ఉన్న ఒక డ్రింక్స్ షాపులో మాత్రం చీజ్‌తో సోడా తయారు చేస్తున్నారు. సోడాలో చీజ్ కలుపుతున్నారు. అంతేకాదు.. ఆ సోడాలో పల్లీలు కూడా కలుపుతున్నారు. ‘చీజ్ బ్లాస్ట్ సోడా’ పేరుతో ఈ స్పెషల్ డ్రింక్ అందిస్తున్నారు. ముందుగా గ్లాసులో రకరకాల సోడా డ్రింక్ నింపి, అందులో పల్లీలు వేసి, పైన తురిమిన చీజ్ కలుపుతున్నారు. ఈ కాంబినేషన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

చీజ్, పల్లీలు, సోడా.. ఇదేం కాంబినేషన్ అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రపంచంలోనే అతి చెత్త సోడా ఇదే అయ్యుంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ డ్రింక్ తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఖాయమని ఇంకొందరు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో చూసి, ఈ డ్రింక్ మీకు నచ్చుతుందో.. లేదో తెలుసుకోండి.

 

 

View this post on Instagram

 

A post shared by Mayur Surti (@foodie_addicted_)