Viral Video: వామ్మో.. రెండు భారీ కొండ చిలువల తోకలను పట్టుకునిలాగిన వ్యక్తి

అమెరికాలో ఓ వ్యక్తి రెండు భారీ కొండ చిలువల తోకలను పట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికన్ యూట్యూబర్, రిప్టైల్ జూ ప్రీహిస్టారిక్ ఇన్ కార్పొరేషన్ సీఈవో జే బ్రూవర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు.

Viral Video: వామ్మో.. రెండు భారీ కొండ చిలువల తోకలను పట్టుకునిలాగిన వ్యక్తి

Viral Video

Viral Video: అమెరికాలో ఓ వ్యక్తి రెండు భారీ కొండ చిలువల తోకలను పట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికన్ యూట్యూబర్, రిప్టైల్ జూ ప్రీహిస్టారిక్ ఇన్ కార్పొరేషన్ సీఈవో జే బ్రూవర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు.

తెల్లటి, నల్లటి కొండ చిలువల తోకలను జే బ్రూవర్ పట్టుకుని వెనక్కి లాగుతుండడం ఈ వీడియోలో చూడొచ్చు. తన కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వేరే ఉద్యోగం చూసుకోవాలని కొందరు స్నేహితులు తనకు సూచిస్తుంటారని, అయినప్పటికీ తాను మార్చుకోలేదని అన్నారు. ఈ వీడియోకు 40 మిలియన్ల వ్యూస్, లక్షన్నర లైకులు వచ్చాయి.

జే బ్రూవర్ ప్యాషన్, నిబద్ధత పట్ల నెటిజన్లు ప్రశ్నంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ రెండు కొండ చిలువలను అతడు పట్టుకున్న తీరు షాక్ ఇస్తోందని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఇటువంటి కెరీర్ ను ఎంచుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారని కొందరు పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

Nepal PM: నేపాల్ ప్రధాని అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్