Viral Video: అమ్మాయి నెక్ట్స్ లెవెల్ స్కిల్స్.. అబ్బురపరుస్తున్న వీడియో
ఆ యువతి పూర్తి శ్రద్ధతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నాంచాకుతో ప్రదర్శన ఇచ్చింది. ఈ సమయంలో మరో వ్యక్తి వీడియో తీశాడు. నెక్ట్స్ లెవెల్ స్కిల్స్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. కొవ్వొత్తులను నాంచాకు సాయంతో వెలింగచడం, ఆర్పేయడం వంటి కళలో యువతి ఆరితేరింది. కళ్లకు గంతలు కట్టుకుని మరీ ఈ ప్రదర్శనను అలవోకగా చేసింది.

Viral Video: పురుషులు మార్షల్ ఆర్ట్స్, కరాటేలో ఆరి తేరడం మనం చూస్తూనే ఉంటాం. కొన్నేళ్లుగా అమ్మాయిలు కూడా వాటిల్లో రాణిస్తున్నారు. తాజాగా, ఓ యువతి ప్రదర్శించిన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలంటే ఎంతో ఏకాగ్రత ఉండాలి.
అటువంటప్పుడే ఆత్మరక్షణ పద్ధతుల్లో ఆరి తేరతారు. ఆ యువతి పూర్తి శ్రద్ధతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నాంచాకుతో ప్రదర్శన ఇచ్చింది. ఈ సమయంలో మరో వ్యక్తి వీడియో తీశాడు. నెక్ట్స్ లెవెల్ స్కిల్స్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
కొవ్వొత్తులను నాంచాకు సాయంతో వెలింగచడం, ఆర్పేయడం వంటి కళలో యువతి ఆరితేరింది. కళ్లకు గంతలు కట్టుకుని మరీ ఈ ప్రదర్శనను అలవోకగా చేసింది. ఆ యువతి ప్రదర్శించిన విన్యాసాలు కొన్ని సినిమాలను గుర్తు చేస్తున్నాయని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఎంతగా నైపుణ్యాలు సాధిస్తారో ఈ అమ్మాయిని చూస్తే తెలుస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.
This woman looks like she came out of a ninja movie pic.twitter.com/m163kz9oNz
— Next Level Skills (@NextSkillslevel) January 28, 2023
Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. మెనూలో ప్రత్యేక వంటకాలు ..