Girl appeals to Modi : ‘మోడీ జీ.. నేను చెప్పేది వినండి’ అంటూ ప్రధాని మోడీకి ఓ బాలిక చేసిన విజ్ఞప్తి.. ఏంటంటే?
బడికి వెళ్లాల్సిన పిల్లలు కనీస సౌకర్యాలు లేని స్కూల్లో నానా ఇబ్బందులు పడుతుంటే అధికారుల కంటికి కనిపించలేదు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు. ఇక ఓ చిన్నారి ఈ విషయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లింది.

Girl appeals to Modi
Girl appeals to Modi : పిల్లలు చక్కగా బడికి వెళ్లి చదువుకోవాలి అంటే అక్కడ వారికి కనీస సౌకర్యాలు ఉండాలి. క్లాసులో బెంచీలు, మరుగుదొడ్డి లేక బూత్ బంగ్లాను తలపిస్తున్న చోట పిల్లలు ఎలా చదువుకుంటారు? అధికారులు, ప్రజా ప్రతినిధులు ఊళ్లో బడుల పరిస్థితిని పట్టించుకోకపోతే ఓ చిన్నారి ఏం చేసిందో చదవండి.
dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్
కూర్చోడానికి బల్లలు లేవు.. పగుళ్లు, దుమ్ముతో ఉన్న నేల.. 5 సంవత్సరాలుగా అపరిశుభ్రంగా ఉన్న బడిలో పిల్లలకు పాఠాలు ఎలా తలకెక్కుతాయి? జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu and Kashmir’s) కతువా జిల్లా (Kathua district) లోహై-మల్హర్ గ్రామంలో (Lohai-Malhar village) ఓ పాఠశాల పరిస్థితి ఇది. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోని ఆ పాఠశాలని పట్టించుకోకుండా వదిలేశారు. ఆ పాఠశాలలో తాము పడుతున్న ఇబ్బందులు వివరిస్తూ ..తమకు స్కూల్ కట్టివ్వమంటూ ఆ పాఠశాల చిన్నారి సీరత్ నాజ్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసిన వీడియో యావత్ దేశాన్ని కదిలిస్తోంది. ‘మోడీ జీ.. మీరు మీతోపాటు దేశం మొత్తం వినమంటూ’.. ఆ చిన్నారి వీడియోలో మొత్తం తమ పాఠశాల పరిస్థితిని వివరించింది. మాకోసం ఒక మంచి స్కూల్ ని నిర్మించి ఇవ్వమని ప్రార్ధించింది. సీరత్ నాజ్ (Seerat Naaz) తమ పాఠశాలలో అపరిశుభ్రంగా ఉన్న నేలపై కూర్చుని చదువులు చదవాల్సి వస్తోందని.. అక్కడి అపరిశుభ్రమైన నేల ఎలా ఉందో చూడమని వివరించింది. 5 సంవత్సరాలుగా తమ స్కూల్ ఇలాగే ఉందని.. దుమ్ము, ధూళితో ఉన్న నేలపై కూర్చుని చదువుకుంటే తమ యూనిఫాంలు మాసిపోతున్నాయని.. ఇంట్లో వారు తమని తిడుతున్నారని.. తాము కూర్చునేందుకు కనీసం బెంచీలు కూడా లేవని ఆమె చెప్పింది. ప్రతి ఫ్లోర్‌ని దుమ్ము,ధూలితో పాటు గతుకుల నేలను వీడియోలో చూపించింది. ఇక అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్డితో తాము పడుతున్న ఇబ్బందులు వివరించింది. తమకు మెరుగైన సౌకర్యాలతో కూడిన పాఠశాల నిర్మించి ఇవ్వమని ప్రధాని మోడీకి ఆమె చేసిన విజ్ఞప్తి అందరి మనసుల్ని కదిలించింది.
అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు ఈ స్కూల్ కి వెళ్లి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని స్ధానికులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి చదువులు ఎలా కొనసాగుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక సీరత్ నాజ్ ప్రధాని మోడీకి వీడియో ద్వారా చేసిన విజ్ఞప్తి చూసైనా అధికారుల్లో కదలిక వస్తుందో.. లేక స్వయంగా మోడీజీ స్పందిస్తారా వేచి చూడాలి. ఏది ఏమైనా ఆ చిన్నారి కోరిక నెరవేరాలని మనసారా కోరుకుందాం.