Weather Forecast: ఎండలు మామూలుగా ఉండవ్.. భారత వాతావరణ శాఖ హెచ్చరిక
ఈ వేసవిలో ఎండలు సాధారణం కంటే అధికంగా ఉండనున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.

Intense sun
Weather Forecast: దేశంలో మూడు నెలల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు భారత వాతావరణ శాఖ (India Meteorological Department) సూచించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పింది.
ఈ మేరకు భారత వాతావరణ శాఖ (India Meteorological Department) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వివరాలు తెలిపారు. బిహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బంగాల్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉందని అన్నారు. మూడు నెలల పాటు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు దక్షిణ, వాయవ్య దేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా అనేక చోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందన్నారు. అలాగే, ఏప్రిల్లో పలు ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. వాయవ్య, మధ్య భారతదేశ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశ ఉందన్నారు. ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.