మోడీ,షా కోడ్ ఉల్లంఘన..ఈసీకి సుప్రీం నోటీసు

  • Published By: venkaiahnaidu ,Published On : April 30, 2019 / 10:38 AM IST
మోడీ,షా కోడ్ ఉల్లంఘన..ఈసీకి సుప్రీం నోటీసు

Updated On : May 28, 2020 / 3:40 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను మే-2,2019కి వాయిదా వేస్తున్నట్లు మంగళవారం(ఏప్రిల్-30,2019) సుప్రీంకోర్టు తెలిపింది.
Also Read : సేవామిత్ర ఆధార్ చౌర్యం వల్ల చాలా డేంజర్

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మోడీ,అమిత్ షా సైనిక బలగాలను వాడుకున్నారని,ఈ  విషయంలో ఎన్నికల సంఘానికి కంప్లయింట్ చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ సోమవారం(ఏప్రిల్-29,2019) సుస్మితా దేవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కు నోటీసు జారీ చేసింది.తదుపరి విచారణను మే-2,2019కి వాయిదా వేసింది.