మరో షాక్ : టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్ కి కూల్చివేత నోటీసులు

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్‌కు గ్రేటర్ విశాఖ మున్సిపల్

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 03:43 AM IST
మరో షాక్ : టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్ కి కూల్చివేత నోటీసులు

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్‌కు గ్రేటర్ విశాఖ మున్సిపల్

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని గంటా శ్రీనివాసరావు క్యాంప్ ఆఫీస్ కి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) నోటీసులు ఇచ్చింది. సమాధానం ఇవ్వకుంటే 24 గంటల్లో కూల్చేస్తామని అధికారులు నోటీసుల్లో తెలిపారు. అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ సీరియస్ అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో భీమిలిలో గంటా శ్రీనివాసరావు క్యాంప్ ఆఫీస్ కి జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గంటా కుమార్తె సాయి పూజిత, రవీంద్రనాథ్ పేరుతో ఈ భవనాన్ని నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా దీన్ని నిర్మించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ నోటీసులపై గంటా వర్గీయులు స్పందించారు. కోర్టు స్టే ఉందని చెప్పారు. విశాఖలో అక్రమ నిర్మాణాలపై 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది.

జీవీఎంసీ అధికారులు నోటీసులతో రాగా.. వాటిని అందుకోవడానికి ఆఫీస్ దగ్గర ఎవరూ లేరు. దీంతో అధికారులు గోడకి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. గురువారం(ఆగస్టు 22,2019) అర్థరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 6 బృందాలతో కూడిన జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. గంటా శ్రీనివాసరావు భవనాన్ని కూల్చడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న గంటా వర్గీయులు హైకోర్టుని ఆశ్రయించారు. స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. స్టే ఆర్డర్ కాపీని జీవీఎంసీ అధికారులకు ఇచ్చారు. దీంతో వారంతా వెనుదిరిగారు. సర్వే నెంబర్ 442 లో గంటా కుమార్తె సాయి పూజిత పేరుతో జీ+ భవనాన్ని నిర్మించారు. దీన్ని 2005 నుంచి క్యాంప్ ఆఫీస్ గా గంటా వినియోగిస్తున్నారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన బిల్డింగ్స్ ను కూల్చివేయాలని అధికారులను ఆదేశించింది. ఒక్క విశాఖ నగరంలోనే 10వేల అక్రమ కట్టడాలు గుర్తించారు. ఆ బిల్డింగ్ యజమానులకు కూల్చివేత నోటీసులు జారీ చేశారు. కాగా, దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మొన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, నేడు గంటా శ్రీనివాసరావు భవనం.. టీడీపీ నేతల భవనాలను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇది కక్ష సాధింపు చర్య అంటున్నారు.

కొన్నిరోజుల క్రితం విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని అక్రమ కట్టడంగా నిర్దారించి జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. ద్వారకానగర్ మెయిన్‌ రోడ్డులో పీలా గోవింద్ బహుళ అంతస్థుల భవనం ఉంది. అనుమతులు లేకుండా డ్రైన్ ఆక్రమించి భవనం నిర్మించారని అధికారులు కూల్చేశారు. టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలను వైసీపీ నేతలు ఖండించారు. రూల్స్ కి విరుద్ధంగా భవనాలు నిర్మించారని అందుకే కూల్చివేస్తున్నారని చెబుతున్నారు. గతంలో దీనికి సంబంధించి పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారని గుర్తు చేస్తున్నారు.

Also Read : పేదలకు సీఎం జగన్ వరం : రాజధానిలో లక్ష ఇళ్లు నిర్మాణం