Petrol-diesel : జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్,డీజిల్‌!

పెట్రోల్-డీజిల్‌ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం పరిశీలించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.

Petrol-diesel : జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్,డీజిల్‌!

Nirmala

Petrol-diesel  పెట్రోల్-డీజిల్‌ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం పరిశీలించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ ను తీసుకురావాలంటూ జూన్‌ నెలలో కేరళ హైకోర్టు సూచనల నేపథ్యంలో ఈ నెల 17న కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జరగనున్న జరగనున్న జీఎస్టీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే, కొవిడ్‌ చికిత్సకు అవసరమయ్యే ఔషధాలకు ఇచ్చిన పన్ను రాయితీలను పొడిగించే అంశంపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా వర్చువల్‌గానే కొనసాగుతున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలు దాదాపు 20 నెలల తర్వాత తొలిసారి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రత్యక్షంగా జీఎస్టీ సమావేశం జరగనుంది .

ఈ సమావేశంలో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం పరిశీలించే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం.పెట్రోల్‌, డీజిల్‌ని జీఎస్టీలోకి తీసుకొస్తే పన్ను భారం తగ్గి ధరల సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. జీఎస్టీ పరిధిలోకి తెస్తే పెట్రో ఉత్పత్తుల ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

READ Quad Summitపై చైనా విమర్శలు