CM Jagan : జీతాలు పెంపు.. సీఎం జగన్ శుభవార్త

ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్చకుల జీతాలను 20 శాతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ

CM Jagan : జీతాలు పెంపు.. సీఎం జగన్ శుభవార్త

Cm Jagan

CM Jagan : ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్చకుల జీతాలను 20 శాతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అర్చకుల సమస్యలపై దృష్టి సారించారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు.

Curry Leaves : కరివేపాకు కొలెస్టరాల్ ను తగ్గిస్తుందా..?

దేవాదాయశాఖపై నిర్వహించిన సమీక్షలో అర్చకులకు ఇళ్ల కేటాయింపుపై ముందుకెళ్లాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ఆలయాల్లో టికెట్ల జారీకి ఆన్ లైన్ విధానం అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు. సమగ్ర భూ సర్వేలో ఆలయ భూములకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పినట్లు మంత్రి చెప్పారు.

Exercise : వ్యాయామం మెదడుకు మేలు చేస్తుందా?

దేవాదాయ శాఖ భూముల సర్వే కూడా చేపట్టనున్నట్లు మంత్రి వెల్లపంల్లి చెప్పారు. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ కు ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలో పర్యవేక్షించాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. దసరా నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు వస్తున్నాయని… ఈ నేపథ్యంలోనే సీఎంకి ఆహ్వానం అందించామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

కాగా, గత వేసవిలోనూ అర్చకుల జీతాన్ని ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. కేటగిరి-1 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచారు. కేటగిరీ-2 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇప్పుడు మరోసారి వారి వేతనాన్ని పెంచుతూ రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.