YSR Asara : ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత అమలుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కడప జిల్లా బద్వేల్ బైపోల్ నేపథ్యంలో కొత్త పథకాల ప్రారంభానికి అనుమతి ఉండదు. కాన

YSR Asara : ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

Ysr Asara

YSR Asara : ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత అమలుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కడప జిల్లా బద్వేల్ బైపోల్ నేపథ్యంలో కొత్త పథకాల ప్రారంభానికి అనుమతి ఉండదు. కానీ, ఈ పథకం కొత్తది కాకపోవటంతో రెండో విడత కార్యక్రమం అమలుకు అనుమతి ఇచ్చినట్టు ఎన్నికల సంఘం వివరించింది. సీఎం జగన్ ఈ పథకం ద్వారా లబ్దిదారులకు నిధులను విడుదల చేయనున్నారు.

గురువారం(అక్టోబర్ 7,2021) ఉదయం ఒంగోలులో సీఎం జగన్ ఆసరా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల 55 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10.35కు ఒంగోలు పోలీసు ట్రైనింగ్‌ కాలేజీకి జగన్ చేరుకోనున్నారు. 11 గంటలకు సభాస్థలి అయిన ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. పది నిమిషాల పాటు స్టాల్స్‌ను పరిశీలిస్తారు. 11 గంటల 15 నిమిషాలకు జ్యోతి ప్రజ్వలన, తర్వాత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం 11.40 నుంచి 12 గంటల వరకు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 12.30కి వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు.

WHO Warning : ముప్పు ఇంకా తొలగలేదు, కరోనాపై డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక

8 లక్షల 42 వేల డ్వాక్రా సంఘాల్లోని 78 లక్షల 75 వేల 599 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఎన్నికల హామీ మేరకు 2019 ఏప్రిల్ 11వ తేదీ ముందు వరకూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందంటూ సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు మొత్తం రూ. 25,579 కోట్ల రుణాలను నాలుగు విడతల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Lion Fish : బాబోయ్.. ఈ చేప చాలా డేంజర్.. విషం చిమ్మి మనిషిని చంపేస్తుంది!

ఇందులో భాగంగా మొదటి విడతగా గత ఏడాది సెప్టెంబర్ 11న రూ.6వేల 330 కోట్ల మొత్తాన్ని డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ రూపంలో ప్రభుత్వం చెల్లించింది. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ నెలలోనే చెల్లించాలని భావించినా.. నిధులు కొరతతో అక్టోబర్ 7కి వాయిదా వేశారు.