AP Cabinet : ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. పలు బిల్లులకు ఆమోదం

పలు బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజీలో మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపింది.

AP Cabinet : ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. పలు బిల్లులకు ఆమోదం

Ap Cabinet

AP Cabinet Approval several bills : అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నవంబర్‌ 29న విద్యా దీవెన కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్‌ మెడిసినల్‌ అండ్‌ ఆరోమేటిక్‌ ప్లాంట్స్‌ బోర్డ్‌లో 8 పోస్టుల మంజూరు, డిప్యూటేషన్‌ విధానంలో 4 పోస్టులు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో 4 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం లభించింది. శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజీలో మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ బొవైన్‌ బ్రీడింగ్‌ బ్రీడింగ్‌ (రెగ్యులేషన్ ఆఫ్‌ ప్రొడక్షన్‌ మరియు సేల్‌ఆఫ్‌ బొవైన్‌ సెమన్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇన్‌సెమినేషన్‌ సర్వీసెస్‌) బిల్లుకు కేబినెట్‌ ఆమోదం లభించింది. నవంబర్‌ 16న ఎస్‌పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కడప జిల్లా కొప్పర్తిలో డిక్సన్‌ టెక్నాలజీస్‌కు నాలుగు షెడ్ల కేటాయింపుతోపాటు ఇన్సెంటివ్‌లకు కేబినెట్‌ ఆమోదం లభించింది. డిక్సన్‌ ఏర్పాటు చేయనున్న మరో యూనిట్‌కు 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్‌ అనుమతి లభించింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌1955కు సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాజమహేంద్రవరం నగరం నామవరం గ్రామంలో 5 ఎకరాల భూమి ముంబైకి చెందిన మహీంద్రా వేస్ట్‌ టు ఎనర్జీ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌కు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 20 సంవత్సరాలపాటు ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ది, అర్చక సంక్షేమం కోసం కామన్‌ గుడ్‌ ఫండ్‌ ఏర్పాటుకు, ఈఏఎఫ్‌ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించి చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం లభించింది. అసెంబ్లీ ముందుకు చట్టం రానుంది.

MLA Roja : చంద్రబాబు దొంగ ఏడుపులను ప్రజలు నమ్మరు : ఎమ్మెల్యే రోజా

ధార్మిక పరిషత్తు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటుకు సంబంధించి దేవాదాయ శాఖ చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తాడేపల్లి మండలంలో ధార్మిక సంస్థకు 6.5 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చట్ట సరవణ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ యూనివర్శిటీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌అండ్‌ రెగ్యులేషన్‌ చట్టంలో సవరణలు, ఉన్నత విద్యాశాఖలో ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌లో సరవణకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం లభించింది. జవహర్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్శిటీ యాక్ట్‌ కు సంబంధించిన సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విజయనగరం జేఎన్టీయూ కాలేజీ పేరు మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయనగరం జేఎన్టీయూ జీవీగా మార్పు చేశారు.

ఉన్నత విద్యా శాఖలో ఏపీ యూనివర్శిటీ చట్టం 1991 లో సవరణలకు ఆమోదం తెలిపిది. ఆచార్య నాగార్జున ఒంగోలు పీజీ క్యాంపస్‌ను పేర్నమిట్టకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఆంధ్రకేసరి యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్‌స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ( రిజర్వేషన్‌ ఇన్‌టీచర్స్‌ క్యాడర్‌) –2021 బిల్లు, శ్రీకాకుళం జిల్లా పొందూరు డిగ్రీ కాలేజీలో 27 టీచింగ్‌ పోస్టులు, 15 నాన్‌ టీచింగ్‌ పోస్టుల మంజూరు, 15 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఒక పోస్టు పదోన్నతి మీద, మిగిలిన 14 అవుట్‌ సోర్స్‌ పద్ధతిలో నియామకం చేయనున్నారు. ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేటాయించిన ఇంటి స్థలం 20 ఏళ్లకు కాకుండా 10 ఏళ్లకే విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

RTC Bus In Flood Water : వరద నీటిలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు..10మంది ప్రయాణికులు గల్లంతు

విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో 21.67 ఎకరాల పోరంబోకు భూమిని గిరిజన మ్యూజియం, బొటానికల్‌ గార్డెన్, టూరిజం డెవలప్‌మెంట్‌కు కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌ యాక్ట్‌ 1971లో సవరణల బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపు విమెన్‌ కో కంట్రిబ్యూటరీ పెన్షన్‌యాక్ట్‌ 2009కు సవరణలు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఏపీ పంచాయతీరాజ్‌ యాక్ట్‌–1994లో సవరణలకు కేబినెట్‌ ఆమోదం లభించింది. జిల్లా పరిషత్‌ల్లో, మండల పరిషత్‌ల్లో 2వ వైస్‌ఛైర్మన్‌ పదవుల కోసం ఉద్దేశించిన సవరణలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ఛైర్‌పర్సన్లను, ఇతర కులాల కార్పొరేషన్ల ఛైర్మన్లను జిల్లా పరిషత్‌ సమావేశాల్లో శాశ్వత ఆహ్వానితులగా అవకాశమిస్తూ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌లో 16 కొత్త పోస్టుల మంజూరు, ఏపీ హైకోర్టులో మీడియేషన్‌ సెంటర్‌ అండ్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (డొమెస్టిక్‌అండ్‌ ఇంటర్నేషనల్‌) ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ సినిమా రెగ్యులేషన్‌యాక్ట్‌ 1955 చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం లభించింది.