Bigg Boss Priyanka : ప్రియాంకపై ప్రశంసలు కురిపించిన నాగబాబు
గత ఆదివారం ప్రియాంక ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ప్రియాంక హౌస్‌లో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచిన మెగాబ్రదర్ నాగబాబును కలిసి, ఆశీర్వాదం...
Bigg Boss Priyanka : ఈ సీజన్ బిగ్‌బాస్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తన ఆటతో పాటు, మానస్ లవ్ ట్రాక్ తో బాగా ఫేమ్ తెచ్చుకొని 13 వారాల పాటు హౌస్‌లో కొనసాగింది ప్రియాంక సింగ్. గతంలో బిగ్ బాస్ లోకి ట్రాన్స్ జెండర్ లు వచ్చినా రెండు మూడు వారాల కంటే ఎక్కువ రోజులు లేరు. కానీ అనూహ్యంగా ఈ సారి ప్రియాంక దాదాపు చివరి దశ వరకు ఉంది. మొన్నటి ఆదివారం ప్రియాంక ఎలిమినేట్ అయింది. అంతకుముందు పెద్దగా ఎవరికీ తెలియని ప్రియాంక బిగ్ బాస్ తో చాలా మంది అభిమానులని సంపాదించుకుంది.
Vikki-Katrina : ఓ వైపు పెళ్లి వేడుకలు.. మరోవైపు విక్కీ కత్రీనాలపై కేసు నమోదు
గత ఆదివారం ప్రియాంక ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బయటకి వచ్చాక ప్రియాంక అభిమానులు ఘన స్వాగతం పలికారు. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ ని ప్రియాంక కరెక్ట్ గా వాడుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇక ప్రియాంక గురించి కొంతమంది సెలబ్రిటీలు కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రియాంక హౌస్‌లో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచిన మెగాబ్రదర్ నాగబాబును కలిసి, ఆశీర్వాదం తీసుకుంది.
Salaar : ‘సాహో’ బ్యూటీతో ‘సలార్’లో ఐటమ్‌సాంగ్
జబర్దస్త్ లో ఉన్నప్పటి నుంచి వీరిద్దరికి పరిచయం ఉంది. అప్పటినుంచి కూడా ప్రియాంకకు నాగబాబు సపోర్ట్ అందిస్తున్నాడు. తనతో దిగిన ఫోటోను నాగబాబు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ప్రియాంకపై ప్రశంశల వర్షం కురిపించాడు. ”ఎన్నో అసమానతలను ధిక్కరించి, అవమానాలను, అవరోధాలను ఎదుర్కొని ఈ రోజు గొప్ప స్థానంలో నిలిచావు. నువ్వు బిగ్‌బాస్ టైటిల్ గెలవకపోవచ్చు. కానీ నిత్యం సమాజంలో నీలా అవమానాలు, హేళన ఎదుర్కొనే వారికి నువ్వు ఒక స్ఫూర్తిగా నిలిచావు. జీవితంలో గెలవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించావు. నా ప్రేమాభిమానాలు, మద్దతు నీకు ఎప్పుడూ ఉంటాయి” అని నాగబాబు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.