Vinod Kumar : ఏబీసీడీలు తెలుసా? బండి సంజయ్ పై వినోద్ కుమార్ ఫైర్

తెలంగాణ బిల్లు ఎలా పెట్టారో సంజయ్ కు కనీస అవగాహన ఉందా? సీఎం కేసీఆర్ పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Vinod Kumar : ఏబీసీడీలు తెలుసా? బండి సంజయ్ పై వినోద్ కుమార్ ఫైర్

Vinod Kumar

Vinod Kumar : తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. రాజకీయవర్గాల్లో దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ప్రధాని మోదీపై భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రధాని మోదీ, బీజేపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు.

తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కు టీఆర్ఎస్ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కు అసలు ఏబీసీడీ లు తెలుసా? అని నిలదీశారు. తెలంగాణ బిల్లు ఎలా పెట్టారో సంజయ్ కు కనీస అవగాహన ఉందా? అని అడిగారు. సీఎం కేసీఆర్ పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు అసలు నువ్వు ఎక్కడ ఉన్నావ్ సంజయ్? అని వినోద్ కుమార్ అడిగారు.

Tata Nexon EV: వావ్! ఈ SUVకారులో రూ. 580కే 1000కి.మీలు ప్రయాణించొచ్చు

పార్లమెంటులో తలుపులు మూసే బిల్లుపై చర్చ పెడతారని స్పష్టం చేశారు. తెలంగాణపై మోదీ అక్కసు ఏంది? అని మండిపడ్డారు. పెప్పర్ స్ప్రే కొట్టింది కాంగ్రెస్ ఎంపీలే అని వినోద్ కుమార్ చెప్పారు. సుస్మా స్వరాజ్ మాట్లాడిన తర్వాత కూడా చర్చ జరగలేదని ఎలా అంటారు? అని మోదీపై సీరియస్ అయ్యారు.

”తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారానంటున్న బండి సంజయ్.. అసలు ఎక్కడున్నాడు? తెలంగాణ బిల్లు సమయంలో ఢిల్లీలో మకాం వేసి రాజకీయ పార్టీల గడప గడప తిరిగాం. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కూర్చుని ప్రతి సభ్యుడితో కేసీఆర్ మాట్లాడారు. ఏబీసీడీలు కూడా తెలియని సంజయ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ.. కాంగ్రెస్ ని విమర్శిస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ, తెలంగాణ మీద మోడీకి అక్కసు ఏంటి?
చర్చ జరగకుండా తెలంగాణ బిల్లు పాస్ అయిందని అంటున్న మోదీ బీజేపీ నేత సుస్మా స్వరాజ్ నాటి వీడియో చూడాలి. 2014లోనూ మోదీ ఇలానే తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు.

Weight : బరువు సులభంగా తగ్గాలంటే?

7 మండలాలతో పాటు సీలేరు పవర్ ప్రాజెక్టు ఏపీలో అక్రమంగా కలపకపోతే తెలంగాణ ఇంకా బాగుండేది. మూడు వ్యవసాయ చట్టాలపై పార్లమెంటులో ఎంత చర్చ పెట్టారో బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రజలకి చెప్పండి. మోడీ తెలంగాణ వస్తే.. సీఎం కేసీఆర్ రాలేదనే విమర్శలు చేస్తున్నారు. భారత్ బయోటెక్ కోసం హైదరాబాద్ కి మోడీ వచ్చినప్పుడు సీఎం వస్తా అంటే వద్దన్నారు మోడీ. మరప్పుడు సంజయ్ మాట్లాడలేదేం? ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ఇప్పుడు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ చెబుతున్నారు. మరి సంజయ్ వారి మెడలు వంచుతారా? ఏపీలో కలిపిన ఏడు మండలాల గురించి బండి సంజయ్‌ మాట్లాడగలరా?” అని వినోద్ కుమార్ నిప్పులు చెరిగారు.