Samantha: శాకుంతలం ఫస్ట్‌లుక్ చూశారా.. దేవకన్యలా సామ్!
సమంత హీరోయిన్గా నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. క్రియేటివ్ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్..
Samantha: సమంత హీరోయిన్గా నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. క్రియేటివ్ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో అల్లుఅర్జున్ కుమార్తె అల్లుఅర్హ డెబ్యూ ఎంట్రీ ఇస్తూ ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు, నీలిమా గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
Samantha : నువ్వు లేని జీవితం ఊహించలేను.. సమంత ఎమోషనల్ పోస్ట్..
త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. అందులో భాగంగా సోమవారం శాకుంతలం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో సమంత దేవకన్యలా కనిపిస్తుంది. చుట్టూ జింకలు, నెమళ్లు ఉండగా మధ్యలో సమంత లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌లుక్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో సమంత మునుపెన్నడూ కనిపించనంత అందంగా కనిపించడం విశేషం కాగా.. ఈ ఫస్ట్ లుక్ సమంత పాత్రను దర్శకుడు తీర్చిదిద్దిన తీరుకు సాక్ష్యంగా నిలుస్తుంది.
Samantha: సామ్ F**K టీ షర్ట్.. సోషల్ మీడియా రచ్చ రచ్చ!
గుణ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ.. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం దిల్ రాజు, గుణశేఖర్ భారీగా ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీ టాక్. మధ్యలో కరోనా ఎఫెక్ట్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. గుణశేఖర్ సినిమా పూర్తిచేసి అనుకున్నట్లే విడుదలకి సిద్ధం చేస్తున్నారు.
Presenting ..
Nature’s beloved..
the Ethereal and Demure.. “Shakuntala” from #Shaakuntalam ? #ShaakuntalamFirstLook@Samanthaprabhu2 @Gunasekhar1 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official @tipsofficial #MythologyforMilennials pic.twitter.com/q4fCjyfnth— Samantha (@Samanthaprabhu2) February 21, 2022