Radhe Shyam: థమన్ నుండి స్పెషల్ ట్రీట్.. ఏమై ఉంటుందబ్బా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతుంది. తొలి రోజు నుండే డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఈ సినిమాకు తొలి రోజు నుండే వసూళ్ల...
Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతుంది. తొలి రోజు నుండే డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఈ సినిమాకు తొలి రోజు నుండే వసూళ్ల హవా కొనసాగుతుంది. తొలి మూడు రోజులలోనే రాధేశ్యామ్ సినిమా రూ.150 కోట్ల భారీ వసూళ్లను దక్కించుకున్నట్లు మేకర్స్ పోస్టర్ల ద్వారా ప్రకటించగా మరో రెండు వారాలు భారీ సినిమాలు లేకపోవడం ఈ సినిమాకి ఇంకా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది.
Radhe Shyam: సాలిడ్ రన్ ఖాయం.. రాధే శ్యామ్ రిజల్ట్ ఇదే!
కాగా.. ఈ సినిమాకు హైలెట్ అయిన అంశాలలో ప్రధానమైనవి విజువల్ ఎఫెక్ట్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సినిమా కథ, పాటలు, డైరెక్షన్ ఏది ఎలా ఉన్నా కానీ.. అవి రెండు మంచి మార్కులు కొట్టేశాయి. కాగా.. ఇప్పుడు ఆ బీజీఎమ్ నుండి ఏదో స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చేశాడు. ఈరోజే ఏ సమయంలో అయినా స్పెషల్ ట్రీట్ ని రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశాడు.
Radhe Shyam: భీమ్లా నాయక్‌ను టచ్ చేయలేకపోయిన రాధేశ్యామ్!
అయితే బీజీఎమ్ కి సంబంధించి ఏం రిలీజ్ చేస్తారో.. ఇది ఏమైఉంటుందో అని అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. మరి ఇదెప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. కాగా, ఈ సినిమాకు తెలుగు పాటు సౌత్ ఆల్బమ్ కి జస్టిన్ ప్రభాకరన్ వర్క్ చెయ్యగా హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ లు సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే అందించాడు. అయితే.. సినిమాలో అదే హైలెట్ గా నిలిచింది.
Releasing the soul of #radheshyam in sometime!! Your favourite BGM from your lovely @MusicThaman anna!!
— Radha Krishna Kumar (@director_radhaa) March 15, 2022