SSMB28 Movie Release Date Locked: మహేష్-త్రివిక్రమ్ కాంబో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక మహేష్ తన నెక్ట్స్ మూవీని ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.
SSMB28 Movie Release Date Locked: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక మహేష్ తన నెక్ట్స్ మూవీని ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, మహేష్ బాబు కెరీర్లో 28వ చిత్రంగా రానున్న సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించబోతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు అప్పుడే క్రియేట్ అయ్యాయి.
SSMB28: మహేష్ కోసం ఇద్దరు స్టార్స్..?
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో, ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాను గతంలోనే అనౌన్స్ చేసినా, ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ వస్తే బాగుంటుందని అందరూ కోరుతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ను అనౌన్స్ చేసింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.
SSMB28 : త్రివిక్రమ్ – మహేష్ సినిమాలో నందమూరి హీరో.. మళ్ళీ విలన్‌గా..
మహేష్ బాబు 28వ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడు. ఈ చిత్రం రిలీజ్ అనౌన్స్మెంట్ రావడంతో చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అప్పుడే అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టులో స్టార్ట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఈ సందర్భంగా కన్ఫం చేశారు.
The Reigning Superstar will arrive on 28th April 2023! ??
Get ready to witness @urstrulymahesh garu in a scintillating Massy look & high octane entertainer ~ #SSMB28 ?#Trivikram @hegdepooja @MusicThaman @vamsi84
#SSMB28From28April pic.twitter.com/Mux0pWnfan
— Haarika & Hassine Creations (@haarikahassine) August 18, 2022