Telangana : రేషన్ షాపుల వద్ద మోడీ ఫోటో పెట్టాలా? అయితే కేంద్ర పథకాలకు కేసీఆర్ ఫోటో పెట్టండీ : హరీశ్ రావు

రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ పెట్టాలని నిర్మలా సీతారామన్ చెబుతున్నారని..ఆమె వ్యహరించిన తీరు ప్రధాని మోడీ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు. రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ పెట్టాలని మంత్రి అన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం..కేంద్ర పథకాలు అమలు చేస్తున్న డబ్బుల్లో తెలంగాణవి కూడా ఉన్నాయిగా..మరి కేంద్రం పథకాలకు కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టరు ? అంటూ ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు.

Telangana : రేషన్ షాపుల వద్ద మోడీ ఫోటో పెట్టాలా? అయితే కేంద్ర పథకాలకు కేసీఆర్ ఫోటో పెట్టండీ : హరీశ్ రావు

Minister Harish Rao satires on BJP government

Telangana : కేంద్రంపై మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. కామారెడ్డిలో పర్యటించిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతరామన్ వ్యహరించిన తీరుపై సెటైర్లు వేశారు మంత్రి హరీశ్ రావు. రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ పెట్టాలని నిర్మలా సీతారామన్ చెప్పారని..ఆమె వ్యహరించిన తీరు ప్రధాని మోడీ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని దుయ్యబట్టారు. రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ పెట్టాలని మంత్రి అన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం..కేంద్ర పథకాలు అమలు చేస్తున్న డబ్బుల్లో తెలంగాణవి కూడా ఉన్నాయిగా..మరి కేంద్రం పథకాలకు కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టరు ? అంటూ ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు.

తెలంగాణ చెల్లించిన డబ్బులతో కేంద్రం పథకాలు చేస్తోందని అన్నారు. రేషన్ బియ్యం అంతా కేంద్రమే ఉచితంగా ఇస్తోందని మంత్రి నిర్మలమ్మ చెబుతున్న మాటల్లో ఏమాత్రం వాస్తవంలేదని కొట్టిపారేశారు హరీశ్ రావు. తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఇస్తున్న ఉచిత బియ్యం కోసం ప్రభుత్వం రూ.3,600 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రులు ప్రజలకు అన్నీ పచ్చి అబద్దాలు చెబుతున్నారంటూ విమర్శించారు హరీశ్ రావు. బీజేపీ నేతలు ఇటువంటి అబద్దాలతో ప్రధాని స్థాయిని దిగజారుస్తున్నారంటూ విమర్శించారు. బీజేపీ నేతలు చెప్పేవన్ని అసత్యాలని..మేము చెప్పేవి మాత్రం నగ్న సత్యాలు అని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించేది ఎక్కువ అయితే కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చేది మాత్రం నామమాత్రమేనన్నారు.

కేంద్రమంత్రులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన మాట్లాడుతున్నారని..ఇది తగదని..మాట్లాడే ప్రతీ మాట వాస్తవంగా ఉండాలని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని బీజేపీ మాత్రం అసత్యాలు మాట్లాడటం మానుకోవాలని ఏది వాస్తవమో..ఏది అవాస్తవమో ప్రజలు గమనిస్తున్నారని హరీశ్ రావు అన్నారు. దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒక‌టి అని తెలిపిన మంత్రి హరీశ్ రావు.. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.65 ల‌క్ష‌ల కోట్లు ఇస్తున్నామ‌ని వెల్లడించారు. తెలంగాణ నుంచి వెళ్లిన నిధుల‌ను దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఖ‌ర్చు పెడుతున్నార‌ని అన్నారు. ఆ రాష్ట్రాల్లో కేసీఆర్ ఫొటో పెట్టాల‌ని డిమాండ్ చేశారు. మీర‌లా అడిగితే… మేం ఇలా అడ‌గమా? అని కేంద్ర మంత్రిని ఆయ‌న ప్ర‌శ్నించారు.

కాగా..కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన తెలంగాణలో కాకపుట్టిస్తోంది. బాన్సువాడ నియోజకవర్గంలోని బిక్నూర్ లో రేషన్ షాపును మంత్రి నిర్మల సందర్శించిన సందర్భంగా కలెక్టర్ కు చెమటలు పట్టించారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అని జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ ని ప్రశ్నించారు. మంత్రి నిర్మల హఠాత్తుగా ఇటువంటి ప్రశ్నవేయటంతో కలెక్టర్ జితేష్ షాక్ అయ్యారు. సమాధానం చెప్పటంలో తెలియదు అన్నట్లుగా నీళ్లు నమిలారు. కలెక్టర్ తీరుపై మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారి అయి ఉండి ఈ పాటి లెక్క కూడా తెలియదా? ఇటువంటివి తెలియకుండానే జిల్లాకు కలెక్టర్ గా ఎలా పనిచేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ లెక్క తెలుసుకోవటానికి మీకు అరగంట సమయం ఇస్తున్నానని… తెలుసుకుని చెప్పాలని ఆర్డర్ వేశారు. అక్కడితో ఊరుకోలేదు మంత్రిగారు. రేషన్ షాపు వద్ద ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని ఇస్తోందని… అలాంటప్పుడు ప్రధాని ఫొటోను ఎందుకు ఉంచలేదని మండిపడ్డారు. రేషన్ షాపుల వద్ద మోదీ ఫొటో పెట్టాలని… లేకపోతే తానే వచ్చి పెడతానని హెచ్చరించారు. ప్రధాని ఫోటోలను ఎవ్వరు తొలగించకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ దేనని నిర్మల తేల్చి చెప్పారు.