Nagarjuna : చైతో చేశాను.. త్వరలో అఖిల్ తో చేయబోతున్నాను.. ఏజెంట్, ఘోస్ట్ కలిస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించండి..

ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఈ వేదికపై నేను, నాగచైతన్య, అఖిల్‌ నిల్చున్నామంటే, మీ దగ్గరనుంచి ఇంత ప్రేమను పొందుతున్నామంటే దీనికి కారణమైన తెలుగు సినీ పరిశ్రమకి, మా నాన్న గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి..............

Nagarjuna : చైతో చేశాను.. త్వరలో అఖిల్ తో చేయబోతున్నాను.. ఏజెంట్, ఘోస్ట్ కలిస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించండి..

Nagarjuna speech at The Ghost Movie Pre Release Event

Nagarjuna :  నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5న దసరా రోజు రిలీజ్ కాబోతుంది. చాలా రోజుల తర్వాత నాగార్జున ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఆదివారం సాయంత్రం ఘోస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాగ చైతన్య, అఖిల్ కూడా విచ్చేశారు.

ఈ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఈ వేదికపై నేను, నాగచైతన్య, అఖిల్‌ నిల్చున్నామంటే, మీ దగ్గరనుంచి ఇంత ప్రేమను పొందుతున్నామంటే దీనికి కారణమైన తెలుగు సినీ పరిశ్రమకి, మా నాన్న గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి థ్యాంక్యూ చెప్పుకోవాలి. ముప్పైమూడు సంవత్సరాల క్రితం అక్టోబరు 5న ‘శివ’ అనే సినిమాతో సైకిల్‌ చైన్‌ పట్టుకుని వచ్చాను. ఇప్పుడు అదే అక్టోబరు 5న ‘ది ఘోస్ట్‌’ సినిమాతో కత్తి పట్టుకొని వస్తున్నాను. విజయదశమి మా ‘ది ఘోస్ట్‌’ చిత్రానికి కూడా విజయాన్ని ఇస్తుందనుకుంటున్నాను. ఈ సినిమా కోసం 15 రోజులు మిలటరీ ట్రైనింగ్ ఇప్పించాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. ఈ ట్రైనింగ్ లో సోనాల్ కాలు కూడా ఇరక్కొట్టుకుంది. ఈ అరుపులు, కేరింతలు చూడటానికే చైని, అఖిల్ ని కూడా రమ్మన్నాను.”

BiggBoss 6 Day 21 : నేహా చౌదరి ఎలిమినేట్.. బాలాదిత్య బెస్ట్ కంటెస్టెంట్.. గీతూకి నోటిదూల ఎక్కువ..

”నేను, చైతన్య కలిసి చేసిన ‘బంగార్రాజు’ సినిమా థియేటర్స్‌లోనే కాదు, టెలివిజన్‌ లోను, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. టీవిలో ఏ సినిమాకి రానంత టీఆర్పీ బంగార్రాజు సినిమాకి వచ్చింది. త్వరలో అఖిల్‌తో కూడా సినిమా చేయబోతున్నాను. ఏజెంట్, ఘోస్ట్ కలిస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. కర్నూలుకి అన్నమయ్య సినిమా సమయంలో వచ్చాను. అప్పుడు బసవన్నకి దండం పెట్టుకున్నాను, డ్యాన్సులు వేశాను. మళ్ళీ ఇప్పుడే. ఘోస్ట్ 5వ తేదీన రిలీజ్ అవుతుంది. మీరంతా థియేటర్ కి వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను. నేను చాలా రోజులైంది ఇలాంటి యాక్షన్ సినిమా చేసి, మీరు ఆదరిస్తారు. నాకు ఎంతో ఆప్తులైన చిరంజీవి గారి సినిమా ‘గాడ్‌ఫాదర్‌’ కూడా అక్టోబరు 5న రిలీజ్‌ కాబోతుంది. ‘ది ఘోస్ట్, గాడ్‌ఫాదర్‌’ రెండు సినిమాలు మంచి విజయం సాధించాలి” అని అన్నారు.