గోవా అంటే తప్పతాగడాలు, డ్రగ్సేనా..? షూటింగ్ చేయాలంటే కండీషన్స్ అప్లై..
సినిమా షూటింగులపై కీలక నిర్ణయం తీసుకున్న గోవా ప్రభుత్వం..
సినిమా షూటింగులపై కీలక నిర్ణయం తీసుకున్న గోవా ప్రభుత్వం..
గోవా.. ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకి మంచి హాలిడే స్పాట్.. అలాగే అక్కడి సముద్ర తీర ప్రాంతాల్లో సినిమా షూటింగ్స్ ఎక్కువగా జరిగుతుంటాయి. అయితే ఇక గోవాలో షూటింగ్ చేయడం కాస్త కష్టమైన విషయంగా మారిందనే చెప్పాలి. గోవా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినిమా షూటింగ్లకు ఇబ్బందిగా మారింది.
వివరాల్లోకెళ్తే.. ఎవరైనా గోవాలో షూటింగ్లు జరుపుకోవాలంటే స్ర్కిప్ట్ను ఎంటర్టైన్మెంట్ సోసైటీ ఆఫ్ గోవా సంస్థకు అందించాలి. సదరు అధికారులు స్క్రిప్ట్ చూసి ఓకే అంటే సినిమా షూటింగ్ చేసుకోవచ్చునని స్వయంగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు.
దీనికి కారణం.. చాలా సినిమాల్లో గోవాను మాదక ద్రవ్యాలు లభించే కేంద్రంగా చూపిస్తున్నారని, ఇలా చేయడం వల్ల రాష్ట్ర గౌరవం దెబ్బ తింటోందని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ ‘మలంగ్’ లో గోవాను మాదక ద్రవ్యాలు తీసుకునేవారికి గోవా ఒక స్వర్గం అన్నట్టు చూపించిన సంగతి తెలిసిందే.