Plane Crashed Power Lines : అమెరికాలో విమాన ప్రమాదం.. విద్యుత్ తీగలపై కుప్పకూలిన ఫ్లైట్
అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. మేరిలాండ్లో విద్యుత్ తీగలపై ఓ విమానం కుప్ప కూలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
plane crashed power lines : అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. మేరిలాండ్లో విద్యుత్ తీగలపై ఓ విమానం కుప్ప కూలిపోయింది. దీంతో మాంట్గొమెరీ కౌంటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు చిన్నపాటి విమానం మాంట్గొమెరీ కౌంటీకి విద్యుత్ సరఫరా చేసే తీగలపై కుప్ప కూలిపోయింది.
దీంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. ఈ కారణంగా మాంట్గొమెరీ కౌంటీ పట్టణంలోని 90 వేలకుపైగా నివాస, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కౌంటీలోని పావు భాగం ప్రస్తుతం అంధకారంలో చిక్కుకుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ప్రమాదం వల్ల ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
A small plane has crashed into power lines in the area of Rothbury Dr & Goshen Rd, taking out power to parts of the county.@mcfrs is on scene. PLEASE AVOID THE AREA, as there are still live wires. #MCPD #MCPNews
— Montgomery County Department of Police (@mcpnews) November 27, 2022