Sai Dharam Tej : కొత్త దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా..

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు తన సినిమాల్లో వేగం పెంచాడు. బైక్ యాక్సిడెంట్ తరువాత పూర్తిగా షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి రెస్ట్ లో ఉన్న ఈ యువహీరో మళ్ళీ వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే...

Sai Dharam Tej : కొత్త దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా..

Sai Dharam Tej new movie with new director

Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు తన సినిమాల్లో వేగం పెంచాడు. బైక్ యాక్సిడెంట్ తరువాత పూర్తిగా షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి రెస్ట్ లో ఉన్న ఈ యువహీరో మళ్ళీ వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే తన 15వ సినిమాను మొదలు పెట్టిన సాయి.. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

Sai Dharam Tej: తేజు బర్త్‌డే గిఫ్ట్.. SDT15 నుండి ఇంటెన్స్ పోస్టర్!

ఈ క్రమంలోనే డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్షుద్ర శక్తులు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందించగా, కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా తన 16వ సినిమాను కూడా ప్రకటించాడు సాయి ధరమ్ తేజ్.

కొత్త దర్శకుడు జయంత్ ఈ సినిమాతో వెండితెరకి పరిచయం అవబోతున్నాడు. సాయి ధరమ్ 15వ సినిమాను తెరకెక్కిస్తున్న ‘బి వి ఎస్ ఎన్ ప్రసాద్’ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. నేడు పూజ కారిక్రమాలతో అఫీషియల్ గా సినిమాను లాంచ్ చేశారు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెట్టుకోనుంది. మరి ‘చిత్రలహరి’ సినిమా తరువాత ఒక హిట్టు లేని సాయి ధరమ్ కి ఈ సినిమాలు సక్సెస్ ని అందిస్తాయో? లేదో? చూడాలి.