Satya Dev : కన్నడ స్టార్ హీరోతో కలిసి సత్యదేవ్ మల్టీస్టారర్.. టైటిల్ కొత్తగా ఉందే..
వరుస సినిమాలతో తన వైవిధ్యమైన ట్యాలెంట్ తో మెప్పిస్తున్న సత్యదేవ్ తాజాగా రిపబ్లిక్ డే రోజు మరో కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. అయితే ఈ సారి కన్నడ స్టార్ హీరో ధనుంజయ్ తో కలిసి పాన్ ఇండియా మల్టీస్టారర్ సినిమా..............
Satya Dev : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి సెకండ్ హీరోగా, విలన్ గా, హీరోగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు సత్యదేవ్. తన నటనతో అందర్నీ మెప్పించి తమిళ్, కన్నడ, బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు అందుకుంటున్నాడు సత్యదేవ్. చిరంజీవి, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు సైతం సత్యదేవ్ నటనకి ఫిదా అయిపోయారు.
వరుస సినిమాలతో తన వైవిధ్యమైన ట్యాలెంట్ తో మెప్పిస్తున్న సత్యదేవ్ తాజాగా రిపబ్లిక్ డే రోజు మరో కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. అయితే ఈ సారి కన్నడ స్టార్ హీరో ధనుంజయ్ తో కలిసి పాన్ ఇండియా మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు. పద్మజ ఫిలిమ్స్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సత్యదేవ్, కన్నడ హీరో ధనుంజయ్ హీరోలుగా సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ‘జీబ్రా’ అనే టైటిల్ ని ప్రకటించారు. సరికొత్తగా ఉన్న ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో గుర్రాల బొమ్మలు, విమానం గాల్లో ఎగిరడం ఉండటంతో ఆసక్తిగా కనిపిస్తుంది.
దీంతో సత్యదేవ్ జీబ్రా సినిమాపై అంతా ఆసక్తిగా ఉన్నారు. హీరో సత్యదేవ్ కి, ధనుంజయ్ ఇద్దరికీ ఇది 26వ సినిమా కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా షూట్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లనున్నారు.
#ZEBRA is the title of my next with the super talented @EashvarKarthic and passionate @SNReddy09 garu and @BalaSundaram_OT
Looking forward to act alongside my brother @Dhananjayaka#SatyaDev26 #Dhananjay26
@priya_Bshankar @JeniPiccinato @OldTownPictures @padmajafilms_ pic.twitter.com/Ix9ksqSrhC
— Satya Dev (@ActorSatyaDev) January 26, 2023