India Key Decision : సింధు నది జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం

సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య కొన్నేళ్లుగా విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది పాక్ కు భారత్ నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

India Key Decision : సింధు నది జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం

India key decision

India Key Decision : సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య కొన్నేళ్లుగా విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది పాక్ కు భారత్ నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సింధు జలాల ఒప్పందం కమిషనర్ల ద్వారా జనవరి 25న నోటీసు పంపినట్లు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం అమలుపై పాక్ మొండి వైఖరి కారణంగానే ఈ నోటీసులు పంపించాల్సివచ్చిందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సింధు నది జలాల ఒప్పందాన్ని స్ఫూర్తితో అమలు చేసే విషయంలో భారత్ ఎల్లప్పుడు, కృతనిశ్చయమతో బాధ్యత ఉంది. కానీ పాక్ చర్యలు ఒప్పందం, నిబంధనలు అమలుకు ఆటంకం కల్గిస్తున్నాయి. ఫలితంగా ఒప్పందాన్ని సవరించుకునేందుకు భారత్ ఇప్పుడు బలవంతంగా నోటీసులు జారీ చేయాల్సివచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నోటీసుతో 90 రోజుల్లోగా భారత్, పాక్ మధ్య చర్చలు నిర్వహించాల్సివుంటుంది.

సింధు నాగరికతపై మరో ఆసక్తికర విషయం

గత 62 ఏళ్ల కాలంలో నేర్చుకున్న పాఠాలతో ఈ ఒప్పందాన్ని అప్ డేట్ చేసుకునేందుకు వీలు లభించినట్లవుతుంది. కిశన్ గంగా, రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు గత ఐదేళ్లుగా పాక్ చర్చలకు నిరాకరిస్తునేవుంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ నోటీసును పంపించాల్సివచ్చిందని సదరు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సింధు నది జలాల వివాదానికి పరిష్కరించుకునేందుకు భారత్, పాకిస్తాన్ మధ్య 1960 సెప్టెంబర్ లో ఒప్పందం కుదిరింది.