Steroid Injections-Tablets Seized : హైదరాబాద్ లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ట్యాబ్ లెట్లు పట్టివేత

హైదరాబాద్ లో జిమ్ కు వెళ్తోన్న యువకులే టార్గెట్ గా మాఫియా రెచ్చి పోతోంది. బాడీ ఫిట్ నెస్ కోసమంటూ ఇంజెక్షన్లను అంటగడుతోంది. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను పట్టుకున్నారు.

Steroid Injections-Tablets Seized : హైదరాబాద్ లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ట్యాబ్ లెట్లు పట్టివేత

Steroid Injections

Steroid Injections-Tablets Seized : హైదరాబాద్ లో జిమ్ కు వెళ్తోన్న యువకులే టార్గెట్ గా మాఫియా రెచ్చి పోతోంది. బాడీ ఫిట్ నెస్ కోసమంటూ ఇంజెక్షన్లను అంటగడుతోంది. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను పట్టుకున్నారు. జిమ్ చేస్తున్న యువకులే టార్గెట్ గా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ట్యాబ్ లెట్లను విక్రయిస్తున్న ముఠా ఆట కట్టించారు. ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి 180 ఇంజెక్షన్స్, 1,100 ట్యాబ్ లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ నగరంలో తక్కువ సమయంలో శరీరాకృతి పెంచుకునేందుకు యువత ప్రయత్నాలు చేస్తున్నారు. యువత ప్రయత్నాలను ఆసరగా చేసుకున్న ఓ ముఠా రెచ్చిపోతోంది. ఇటివల కాలంలో భారీగా స్టెరాయిడ్ సరఫరా చేస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. జిమ్ లోకి వీరు అందిస్తున్న భారీ మొత్తం స్టెరాయిడ్ ను స్వాధీనం చేసుకున్నారు.

Hormones : బరువును ప్రభావితం చేసే హార్మోన్లు ! వాటిని మెరుగుపరచటం ఎలాగంటే?

ప్రస్తుతం 180 ఇంజెక్షన్లతోపాటు 11 వందల ట్యాబెలెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో జిమ్స్ కు సంబంధించిన నిర్వహకులతో కాంటాక్టులు ఏర్పరచుకుని.. తక్కువ సమయంలో శరీరాకృతిని మార్చుకోవాలనే వారిని టార్గెట్ గా చేస్తూ ఈ ముఠా దందా చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నగరంలో 80కిపైగా జిమ్ లకు సంబంధించి వీరికి కాంటాక్టులున్నట్లు తెలుస్తోంది.

జిమ్ కు వచ్చే యూత్ తక్కువ సమయంలో వారి శరీర ఆకృతి పెంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. వీటికి సంబంధించి జిమ్ నిర్వహకుల ప్రోద్బలంతోనే స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు, ముందులు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా గడిచిన ఏడాది కాలంగా నడుపుతున్నట్లు సమాచారం. ఒక ఫిర్యాదు మేరకు సౌత్ జోన్ పోలీసులు పక్కా సమాచారంతో ఈ ముఠాను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

Muscle Pain : కండరాల నొప్పికి కారణాలు తెలుసా? నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే?

ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. లిస్టులో ఇంకా ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్ నగరంలో ఇంకా ఎన్నెన్ని జిమ్ సెంటర్లు ఉన్నాయి? ఇంకెంతమంది యువకులు స్టెరాయిడ్ తోపాటు ట్యాబ్ లెట్స్ వాడుతున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.