Samsung Galaxy M14 5G : భారత్‌కు శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

Samsung Galaxy M14 5G : భారత్‌కు శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ధర ఎంత ఉండొచ్చుంటే?

Samsung Galaxy M14 5G : భారత్‌కు శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

Samsung confirms Galaxy M14 5G launch date

Samsung Galaxy M14 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) భారత మార్కెట్లో (Galaxy M14 5G) లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 17న స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో పటిష్టమైన డిజైన్‌తో వస్తుందని చెప్పవచ్చు.

అమెజాన్‌ (Amazon)లోని మైక్రోసైట్ స్మార్ట్‌ఫోన్ గురించి కొన్ని కీలక వివరాలను వెల్లడించింది. అమెజాన్‌లో సేల్ డేట్ ఇంకా వెల్లడించలేదు. మైక్రోసైట్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 13 విభిన్న 5G బ్యాండ్‌లకు సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ డివైజ్ 5nm Exynos 1330 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. చిప్‌సెట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Read Also : Reliance Jio True 5G : తెలంగాణ వ్యాప్తంగా జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా మరో 14 నగరాల్లోకి.. మీరు ఉండే ప్రాంతం ఉందేమో చెక్ చేసుకోండి..!

కెమెరా సిస్టమ్ పరంగా, ఈ స్మార్ట్‌ఫోన్ 50-MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. శాంసంగ్ యూజర్లు అద్భుతమైన ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేసేందుకు అనుమతిస్తుందని శాంసంగ్ పేర్కొంది. రాబోయే Galaxy M14 5G కూడా భారీ 6000mAh బ్యాటరీతో రానుంది. బాక్స్‌లో 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. గెలాక్సీ M14 5G బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది, 155 గంటల వరకు ఆడియో ప్లేబ్యాక్ టైమ్, 58 గంటల టాక్ టైమ్, 27 గంటల ఇంటర్నెట్ వినియోగం లేదా 25 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్, సింగిల్ ఛార్జింగ్‌తో పొందవచ్చునని శాంసంగ్ పేర్కొంది.

Samsung confirms Galaxy M14 5G launch date

Samsung confirms Galaxy M14 5G launch date

అమెజాన్ ఇండియా (Amazon India)లో మైక్రోసైట్ (Samsung Galaxy M14 5G) డిజైన్, ఫారమ్ ఫ్యాక్టర్‌పై కొన్ని వివరాలను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. డివైజ్ వెనుక ప్యానెల్ ప్లాస్టిక్‌తో వచ్చింది. తేలికైన, మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడే యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

వెనుకవైపు కెమెరా సెటప్ వర్టికల్ షేప్ వంటి మూడు రౌండబుల్ బంప్‌లను కలిగి ఉంటుంది. ఈ డిజైన్ శాంసంగ్ Galaxy A14 5G మాదిరిగా కనిపిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ M14 5G కచ్చితమైన ధర అధికారికంగా ప్రకటించలేదు. (Amazon India)లోని మైక్రోసైట్ డివైజ్ ధర రూ. 13,XXX నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 13,499 లేదా రూ. 13,999గా ఉండవచ్చు.

Read Also : Best Premium Smartphones : ఏప్రిల్ 2023లో బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!