Balagam : TS కానిస్టేబుల్ పరీక్షల్లో బలగం సినిమాపై ప్రశ్న.. ఏంటో తెలుసా?

బలగం సినిమాకు సంబంధించి ఓ ప్రశ్నను తాజాగా జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్షల్లో అడిగారు. మే 30న తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష జరిగింది.

Balagam : TS కానిస్టేబుల్ పరీక్షల్లో బలగం సినిమాపై ప్రశ్న.. ఏంటో తెలుసా?

Balagam movie related question in TS constable written exam

Balagam :  కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) జంటగా మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన సినిమా బలగం(Balagam). దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) ఈ సినిమాని నిర్మించింది. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ తో పాటు పేరు కూడా సంపాదించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి అభినందనలు వస్తున్నాయి. 50 రోజులు ఈ సినిమా థియేటర్స్ లో ఆడింది. ఇక ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది బలగం సినిమా. బలగం సినిమాకు సంబంధించి ఓ ప్రశ్నను తాజాగా జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్షల్లో అడిగారు. మే 30న తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష జరిగింది.

Bheems Ceciroleo : బలగం సంగీత దర్శకుడికి దాదాసాహెబ్ అవార్డు..

ఈ కానిస్టేబుల్ పరీక్షల్లో మార్చ్ 2023 ఓనికో ఫిలిం అవార్డుల్లో బలగం సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించింది అని ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నని అడిగారు. దీనికి ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అని ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఉత్తమ నాటకం అనేది కరెక్ట్ సమాధానం. 2023 మార్చ్ ఓనికో ఫిలిం ఫెస్టివల్ లో బలగం సినిమా ఉత్తమ డ్రామా(నాటకం) ఫీచర్ ఫిలిం విభాగంలో అవార్డు అందుకుంది.

View this post on Instagram

A post shared by Venu Yeldandi (@venuyeldandi9)