Urinary Tract Infections : యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ బారినపడే స్త్రీలు చికిత్స పొందకపోతే కిడ్నీ ఇన్ఫెక్షన్ల బారిన పడతారా?

మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట ఉంటుంది. తక్కువ మొత్తంలో మూత్రం ఉత్పత్తి చేయబటం, తరచుగా లేదా మూత్ర విసర్జన చేయాలనే బలమైన కోరిక కలిగి ఉంటారు. దిగువ పొత్తికడుపు ఒత్తిడి, అసౌకర్యం, మూత్రం నురగగా, బలమైన వాసన కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తంతో కూడిన మూత్రం రావటం, బలహీనంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది.

Urinary Tract Infections : యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ బారినపడే స్త్రీలు  చికిత్స పొందకపోతే కిడ్నీ ఇన్ఫెక్షన్ల బారిన పడతారా?

Urinary Tract Infections

Urinary Tract Infections : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ను బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గా చెప్పవచ్చు. ఇది సాధారణంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి చికిత్స పొందకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే, UTI మూత్రపిండాలు, మూత్ర నాళాలు, మూత్రాశయం, మూత్ర వ్యవస్థలోని ఇతర భాగాలలో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. బాక్టీరియా, సాధారణంగా ఎస్చెరిచియా కోలి మూత్ర నాళంలోకి ప్రవేశించినప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య ఉత్పన్నం అవుతుంది. ఇది చివరకు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.

READ ALSO : Kidney Health In Summer : వేసవిలో కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమైన జీవనశైలి మార్పులు ఇవే !

పురుషుల కంటే మహిళల్లో లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఎందుకు వస్తాయ్?

అనేక కారణాల వల్ల మహిళలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతారు. స్త్రీపురుషుల అనాటమీలో తేడా ఉండడం ప్రధాన కారణాలలో ఒకటి. పురుషుల కంటే స్త్రీలకు మూత్ర నాళం తక్కువగా ఉంటుంది. ఆసన రంధ్రానికి దగ్గరగా ఉండటంతో, బాక్టీరియా ఆసన ప్రదేశం నుండి మూత్ర నాళంలోకి ప్రవేశిస్తుంది. దీంతో పాటు లైంగిక కార్యకలాపాలు స్త్రీలను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు గురి చేస్తాయి. జెల్లీ, డయాఫ్రాగమ్‌లు, గర్భాశయ నిరోధకాలు మొదలైన జనన నియంత్రణ కారకాలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు ప్రమాదం పెరగటానికి కారణమౌతాయి.

READ ALSO : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే మలబద్ధకం , రుతువిరతి వంటి ఇతర ప్రమాద కారకాలు ఉన్నాయి. రుతువిరతి సమయంలో, జననేంద్రియ మార్గంలో ఈస్ట్రోజెన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల స్త్రీలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను తగ్గిస్తుంది. దీని వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లతో, బ్యాక్టీరియా మూత్రాశయం నుండి కిడ్నీకి చేరినట్లైతే, తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఈ సమయంలో మహిళలు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను గురై వైద్యసహాయం అవసరం కావచ్చు. కొన్ని సందర్భాల్లో సర్జరీ అవసరపడవచ్చు.

READ ALSO : kidney Stones : కాఫీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా లేదా తగ్గుతుందా?

మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?

మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట ఉంటుంది. తక్కువ మొత్తంలో మూత్రం ఉత్పత్తి చేయబటం, తరచుగా లేదా మూత్ర విసర్జన చేయాలనే బలమైన కోరిక కలిగి ఉంటారు. దిగువ పొత్తికడుపు ఒత్తిడి, అసౌకర్యం, మూత్రం నురగగా, బలమైన వాసన కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తంతో కూడిన మూత్రం రావటం, బలహీనంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది. జలుబు లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లక్షణాలన్నీ ఉండకపోవచ్చు. కొంతమందికి ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చికిత్స చేయకుండా వదిలేస్తే ఏమి జరుగుతుంది?

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సరిగ్గా పరిష్కరించకపోతే తీవ్రస్ధాయి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్ మూత్రాశయం నుండి కిడ్నీకి వ్యాపిస్తే అది పైలోనెఫ్రిటిస్ అని పిలువబడే మరింత ప్రమాదకరమైన పరిస్థితికి చేరుతుంది. దీని ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. కొన్ని సార్లు మూత్రపిండాల వైఫల్యం కూడా సంభవించవచ్చు.

READ ALSO : kidney Cells : దెబ్బతిన్న కిడ్నీ కణాలను తిరిగి యాక్టివేట్ చేయడంలో శాస్త్రవేత్తల సక్సెస్! దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి చికిత్సలో గేమ్ ఛేంజర్

గర్భిణీ స్త్రీలలో చికిత్స చేయని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు తక్కువ బరువుతో లేదా అకాల డెలివరీకి ప్రధాన కారణం కావచ్చు. అందువల్ల, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చికిత్సపొందటం మంచిది. ఎపిసోడ్‌లకు చికిత్స చేయడం మరియు అన్ని కారకాలను నివారించడం చాలా వివేకం.

తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గురయ్యే స్త్రీలు లైంగిక సంపర్కం సమయంలో రక్షణను ఉపయోగించాలి. పరిశుభ్రతను పాటించాలి. మహిళలు అన్ని వయసులవారిలో మలబద్ధకాన్ని నివారించాలి. ముఖ్యంగా రుతుక్రమం ఆగిన వయస్సులో పుష్కలంగా నీరు సేవించాలి. మహిళలు హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల మూత్ర నాళం నుండి బ్యాక్టీరియాను బయటకు పంపవచ్చు.