మాస్క్‌ ఉంటేనే పెట్రోల్‌.. రేషన్ కూడా!

  • Published By: vamsi ,Published On : May 1, 2020 / 09:06 AM IST
మాస్క్‌ ఉంటేనే పెట్రోల్‌.. రేషన్ కూడా!

ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా వైరస్ కాలంగా మారిపోయింది. ఎక్కడా కూడా అత్యవసర సేవలు మినహా ఏ సేవలు కూడా అందుబాటులో లేవు.. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా గోవా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఆ రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న గోవా ప్రభుత్వం.

లేటెస్ట్‌గా.. ముఖాలకు మాస్క్‌‌లు లేకపోతే వాహనాలకు పెట్రోల్‌ పోయకూడదంటూ ఆదేశాలు విడుదల చేసింది అక్కగడ. ఈ మేరకు రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ బంకుల యాజామాన్యలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే రేషన్‌ షాపుల వద్దకు కూడా మాస్క్‌లతో రావాలని, లేకపోతే రేషన్‌ ఇవ్వరాదంటూ హెచ్చరికలు జారీ చేసింది. 

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోవాలో ఇప్పటివరకు కేవలం 7 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదవగా.. వారంతా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయినప్పటికీ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ముందుస్తు జాగ్రత్త చర్యలను తీసుకుంది అక్కడి ప్రభుత్వం.

Also Read |  మెట్రోసిటీలు అన్నీ రెడ్ జోన్లే..: కేంద్ర ప్రభుత్వం