Power Politics: తమిళనాడులో అమిత్ షా అడుగుపెట్టగానే కరెంట్ పోయింది. డీఎంకే కావాలనే చేసిందా?

విద్యుత్ బోర్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 230 కేవీ హైటెన్షన్ సరఫరా లైన్ గ్రిడ్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల కరెంట్ పోయిందని.. దాని కారణంగానే విమానాశ్రయం సహా పరిసర ప్రాంతాల్లో కరెంట్ లేదని తెలిపారు. శనివారం రాత్రి 9:30 గంటల నుంచి 10: 12 గంటల వరకు ఆ ప్రాంతాల్లో కరెంట్ లేదు

Power Politics: తమిళనాడులో అమిత్ షా అడుగుపెట్టగానే కరెంట్ పోయింది. డీఎంకే కావాలనే చేసిందా?

Power cut: తమిళనాడు పర్యటనకు వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెన్నైలో అడుగు పెట్టగానే అంధకారం ఎదురైంది. శనివారం రాత్రి ఆయన చెన్నై విమానాశ్రయంలో దిగగానే పరిసరాల్లో కరెంట్ పోయింది. దీంతో డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఉద్దేశ పూర్వకంగానే కరెంట్ తీసేశారని డీఎంకేపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలంటూ చెన్నైలో బీజేపీ ధర్నా నిర్వహించారు. అయితే అనుకోకుండా జరిగిన సంఘటనపై బీజేపీ రాజకీయం చేస్తోందని, అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని డీఎంకే నేతలు ప్రతి దాడి చేస్తున్నారు.

Hiroshi Suzuki Viral Video: ‘బాబోయ్ నా భార్య కారంతో చంపేస్తోంది’, ఇండియన్ ఫుడ్‭పై జపాన్ అంబాసిడర్ ట్వీట్.. ప్రధాని మోదీ ఏమన్నారో తెలుసా?

విద్యుత్ బోర్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 230 కేవీ హైటెన్షన్ సరఫరా లైన్ గ్రిడ్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల కరెంట్ పోయిందని.. దాని కారణంగానే విమానాశ్రయం సహా పరిసర ప్రాంతాల్లో కరెంట్ లేదని తెలిపారు. శనివారం రాత్రి 9:30 గంటల నుంచి 10: 12 గంటల వరకు ఆ ప్రాంతాల్లో కరెంట్ లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

Apsara Case : అప్సర హత్య కేసులో వెలుగులోకి మరో కొత్తకోణం.. అప్సర పెళ్లిఫొటోలు వైరల్

‘‘ఎండాకాలం వేడి వల్ల ఈ నెలలో కరెండు వాడకం చాలా పెరిగిపోయింది. అందువల్ల కొన్ని సందర్భాల్లో కరెంటో పోతోంది. ఇదేం అంతర్జాతీయ సమస్య కాదు. బీజేపీకి దీని మీద అంత ఆసక్తి ఉంటే సీబీఐని పిలిపించి విచారణ చేసుకొమ్మనండి. ఇలాంటి చిన్న విషయాల మీద కూడా వాళ్లు రాజకీయాలు చేస్తున్నారు’’ అని డీఎంకే అధికార ప్రతినిధి ఎలంగోవన్ మండిపడ్డారు.