Amit Shah : టార్గెట్ తెలంగాణ.. 15న ఖమ్మంకు అమిత్ షా, టూర్ షెడ్యూల్ ఇలా..

Amit Shah : ఖమ్మం జిల్లా ప్రజలకు భరోసా కల్పించేందుకే అమిత్‌ షాతో ఈ నెల 15న సభ నిర్వహిస్తున్నామని బండి సంజయ్ చెప్పారు.

Amit Shah : టార్గెట్ తెలంగాణ.. 15న ఖమ్మంకు అమిత్ షా, టూర్ షెడ్యూల్ ఇలా..

Amit Shah (Photo : Twitter)

Amit Shah – Khammam : బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బీజేపీ అగ్ర నాయకులు తెలంగాణ బాట పట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.

ఈ నెల 15న ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. అలాగే, తెలంగాణ పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలకు సమయం కేటాయించనున్నారు అమిత్ షా. శంషాబాద్ లో గంటన్నర పాటు కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు.

అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్:
* ఈ నెల‌ 15న తెలంగాణకు బీజేపీ అగ్రనేత అమిత్ షా
* తెలంగాణలో 12గంటల పాటు గడపనున్న కేంద్ర హోంమంత్రి
* 15వ తేదీ గురువారం ఉదయం 11గంలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అమిత్ షా
* ఎయిర్ పోర్టు నుంచి జేడీ కన్వెన్షన్ కు రోడ్డు మార్గాన అమిత్ షా
* 12.45 గంటల వరకు కార్యకర్తలతో టిఫిన్ బైఠక్ లో పాల్గొననున్న అమిత్ షా

Also Read..Narayana Kankanala : మోదీకి 30మందికి పైగా పిల్లలు, బానిసలా జగన్, కేసీఆర్ చాలా తప్పులు చేస్తున్నారు- సీపీఐ నారాయణ నిప్పులు

* మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 2.10 గంటలకు భద్రాచలం చేరుకోనున్న అమిత్ షా
* 2.20 గంటల నుంచి 3.20 గంటల మధ్య భద్రాచలం రాములవారి దర్శనం
* 3.30గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి 4గంటలకు హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకోనున్న అమిత్ షా
* 4.10గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న కేంద్ర హోంమంత్రి
* 4.50 నుంచి 5.50గంటల‌ వరకు ఖమ్మం బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా

* అనంతరం హెలికాప్టర్ లో ఖమ్మం నుంచి సాయంత్రం 6.45గంటలకు శంషాబాద్ కు బీజేపీ అగ్రనేత
* రాత్రి 7గంటల నుంచి 7.30గంటల వరకు శంషాబాద్ నోవాటెల్ లో విశ్రాంతి
* 7.30గంటల నుంచి 8.30గంటల వరకు బీజేపీ రాష్ట్ర నాయకులతో సమావేశం
* అనంతరం రాత్రి 9.30గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో‌ పయనం.

Also Read..Bandi Sanjay : బీఆర్ఎస్ ను ధైర్యంగా ఎదుర్కొనే పార్టీ బీజేపీనే : బండి సంజయ్

ఖమ్మం జిల్లా ప్రజల్లో భరోసా నింపేందుకే అమిత్‌ షాతో ఈ నెల 15న సభ నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఆ సభకు భారీగా తరలివచ్చి బీజేపీ బలమేంటో  కార్యకర్తలు చూపించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో తప్పకుండా బీజేపీ గెలుస్తుందని బండి సంజయ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.