Gautam Gambhir : ధోని వ‌ల్ల ప్ర‌పంచ‌క‌ప్‌లు రాలేదు.. అలా అత‌డిని హీరోని చేశారు.. నిజ‌మైన‌ హీరో గురించి మాత్రం మాట్లాడ‌రు

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్(WTC Final) మ్యాచ్‌లో టీమ్ఇండియా(Team India) ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో దాదాపు 10 ఏళ్ల త‌రువాత ఐసీసీ(ICC) ట్రోఫీని నెగ్గే అవ‌కాశాన్ని భార‌త్ కోల్పోయింది.

Gautam Gambhir : ధోని వ‌ల్ల ప్ర‌పంచ‌క‌ప్‌లు రాలేదు.. అలా అత‌డిని హీరోని చేశారు.. నిజ‌మైన‌ హీరో గురించి మాత్రం మాట్లాడ‌రు

Dhoni was made hero by PR team

Gambhir : డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్(WTC Final) మ్యాచ్‌లో టీమ్ఇండియా(Team India) ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో దాదాపు 10 ఏళ్ల త‌రువాత ఐసీసీ(ICC) ట్రోఫీని నెగ్గే అవ‌కాశాన్ని భార‌త్ కోల్పోయింది. ఈ నేప‌థ్యంలో కొంద‌రు ఫ్యాన్స్ ఐసీసీ ట్రోఫీలు నెగ్గడం ధోనీ(MS Dhoni)కే సాధ్యమని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు, రెండు ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్ల‌లోని స‌భ్యుడైన గౌత‌మ్ గంభీర్(Gautam Gambhir) ఘాటుగా స్పందించాడు. 2007 టీ20, 2011 వన్డే ప్ర‌పంచ క‌ప్‌లు ధోని వ‌ల్ల‌ రాలేద‌ని, స‌మిష్టిగా రాణించ‌డంతోనే భార‌త్ విజేత‌గా నిలిచింద‌న్నాడు. అయితే.. పీఆర్ ఏజెన్సీ ధోని ని హీరో చేసింద‌ని మండిప‌డ్డాడు.

టీమ్ఇండియా ఈ రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు సాధించింది అంటే అందుకు ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగే కార‌ణం అని చెప్పాడు. ఈ రెండు టోర్నీల్లోనూ యువరాజ్ సింగ్ అసాధారణ ప్ర‌ద‌ర్శ‌న చేశాడ‌న్నాడు. అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే.. వాస్త‌వానికి యువీకి రావాల్సిన గుర్తింపు రాలేదు. అయితే..పీఆర్ ఏజెన్సీ బృందాలు మాత్రం ధోనీ ని హీరోని చేశాయ‌ని చెప్పుకొచ్చాడు.

Suresh Raina : లంక ప్రీమియ‌ర్ లీగ్ వేలంలో చిన్నత‌లా.. ధ‌ర ఎంతంటే..?

ఓట‌ముల‌కు కార‌ణ‌మ‌దే

ఇక టీమ్ఇండియా గ‌త ప‌దేళ్లుగా ఐసీసీ ట్రోఫీలు గెల‌వ‌లేక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని గంభీర్ తెలిపాడు. వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇచ్చిన ప్రాధాన్యం జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లేన‌ని చెప్పుకొచ్చాడు. ఇత‌ర జ‌ట్లు మాత్రం స‌మిష్టిగా ఆడ‌డానికి పెద్ద‌పీట వేస్తాయ‌న్నాడు. పెద్ద టోర్నీలు గెల‌వాలంటే ఒక్క‌డి వ‌ల్లే సాధ్యం కాద‌న్నాడు. అదే క‌నుక నిజం అయితే టీమ్ఇండియా ఇప్ప‌టికే 5 నుంచి 10 ప్ర‌పంచ క‌ప్ గెలిచి ఉండాల్సింద‌ని అభిప్రాయ ప‌డ్డాడు.

2007 టీ20, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల గురించి మాట్లాడినప్పుడు ఒక్క‌సారి కూడా యువీ ప్ర‌స్తావ‌న తీసుకురాం. ఎందుకంటే ప‌ని గ‌ట్టుకుని పీఆర్ ఏజెన్సీలు ఈ విజ‌యాల మొత్తం ప్ర‌తిఫ‌లాన్ని ధోనికి ద‌క్కేలా చూశాయి. ఇత‌రుల పాత్ర ఏ మాత్రం లేన‌ట్లుగా చిత్రీక‌రించాయ‌ని మండిప‌డ్డాడు. స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న‌తోనే ఆ విజ‌యాలు సొంతం అయ్యాయ‌ని గంభీర్ అన్నాడు.

Womens Asia Cup 2023 : విజృంభించిన శ్రేయాంక పాటిల్.. 34 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ప్ర‌త్య‌ర్థి .. భార‌త్‌ ఘ‌న విజ‌యం

నిజానికి 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు 2011 వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచుల్లో గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ రెండు మ్యాచుల్లోనూ టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో గంభీరే టాప్ స్కోర‌ర్‌. అయితే.. అత‌డికి ద‌క్కాల్సిన క్రికెట్ ద‌క్క‌లేదు.