Ravinder Gupta : తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తాకు 14 రోజులు రిమాండ్

యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ అరుణ నుంచి అధికారులు సమాచారం సేకరించారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చిన అంశానికి సంబంధించిన వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Ravinder Gupta : తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తాకు 14 రోజులు రిమాండ్

Ravinder Gupta

Ravinder Gupta Remand : తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్యయ్యారు. రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కాలేజీలో డిగ్రీ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కారు. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లో షిర్డి సాయి ఎడ్యుకేషనల్ సొసైటీలో గతంలో డిగ్రీ పరీక్ష నిర్వహణ కేంద్రం ఉండేది. కానీ రద్దు చేశారు. డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని పునరుద్ధరించాలని వీసీని ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు శంకర్ కలిశారు.

ఇందుకు వీసీ రూ.50 వేలు డిమాండ్ చేశారు. వారి మధ్య ఒప్పందం కుదరడంతో పరీక్ష కేంద్రం నిర్వహణకు అనుమతి లభించింది. లంచం సొమ్మును హైదరాబాద్ తార్నాక కమిటీ కాలనీలో తన ఇంటికి తీసుకురావాలని రవీందర్ సూచించారు. లంచం విషయం తెలియడంతో ఏసీబీ అధికారులు తార్నాకలో మాటు వేశారు. శనివారం ఉదయం శంకర్ నుంచి వీసీ రవీందర్ డబ్బు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేశారు.

Nalla Ramakrishnaiah: రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ కిడ్నాప్, దారుణ హత్య.. పోలీసుల విచారణలో కీలక విషయాలు

సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వరకు దాదాపు 8 గంటలకు వరకు సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీసీ రవీందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. తెలంగాణలో చరిత్రలో ఒక వీసీ అరెస్టు కావడం ఇదే తొలిసారి. ఏసీబీ మరో బృందం నిజామాబాద్ జిల్లాలోని విశ్వ విద్యాలయంలో సోదాలు నిర్వహించింది.

యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ అరుణ నుంచి అధికారులు సమాచారం సేకరించారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చిన అంశానికి సంబంధించిన వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తనపై జరిగిన ఏసీబీ దాడులపై ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని వీసీ తెలిపారు. వీసీ రవీందర్ తీరు ఆది నుంచి వివాదాస్పదమే. విశ్వ విద్యాలయంలో పాలనను గాలికి వదలేశారని, అక్రమాలకు అడ్డాగా మారిందని ఆయనపై విమర్శలు ఉన్నాయి.

Bandi Sanjay : కాంగ్రెస్ లో గెలిచినవారు బీఆర్ఎస్ లో చేరుతారు.. 30 సీట్లను డిసైడ్ చేసేది కేసీఆరే : బండి సంజయ్

సామాగ్రి కొనుగోలుతోపాటు పొరుగు సేవల సిబ్బంది నియామకాల్లో కమీషన్ తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీసీగా రేండేళ్లపాటు కొనసాగిన రవీందర్ మూడు నెలలకు ఒకసారి జరపాల్సిన పాలక మండలి సమావేశాన్ని ఏడాదిన్నరపాటు నిర్వహించలేదు. పాలక మండలి నియమించిన రిజిస్టర్ ను తిరస్కరించి తనకు నచ్చాన వారిని నియమించుకున్నారు.

ఏడాదిన్నర కాలంగా బడ్జెట్ కు ఆమోదం లేకుండానే కోట్ల రూపాయలను ఖర్చు చేయడంపై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి పాలక మండలి నివేదించింది. వీసీ నిర్ణయాలపై విజిలెన్స్, ఏసీబీలతో విచారణ చేయించాలని తీర్మానించింది. ఈ క్రమంలోనే జూన్ 6, 13 తేదీల్లో వర్సిటీలో విజిలెన్స్ దాడులు జరిగాయి.