Samsung Galaxy M34 5G : శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ భారత్‌కు వచ్చేస్తోంది.. ధర, స్పెషిఫికేషన్లు లీక్..!
Samsung Galaxy M34 5G : శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ భారత మార్కెట్లో త్వరలో లాంచ్ కానుంది. అమెజాన్‌లో రాబోయే శాంసంగ్ ఫోన్ కోసం లాంచ్ పేజీని రివీల్ చేసింది.
Samsung Galaxy M34 5G India Launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి కొత్త 5G ఫోన్ రాబోతోంది. శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy F54 5G) లాంచ్ తర్వాత, కంపెనీ Galaxy M సిరీస్‌లో కొత్త 5G ఫోన్‌ను ప్రకటించేందుకు రెడీగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ M34 టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా, త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
ఈ కొత్త శాంసంగ్ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక లాంచ్ పేజీని అమెజాన్ వెల్లడించింది. Galaxy M34 వెనుక ప్యానెల్ డిజైన్ ఫ్లాగ్షిప్ గెలాక్సీ S23 సిరీస్‌ని పోలి ఉండవచ్చనని లిస్టు సూచిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ M34 ఫోన్ లీక్ ధర, స్పెసిఫికేషన్లతో సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ M34 5G భారత్ ధర (అంచనా) :
టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ డివైజ్ ధర రూ. 20వేల సెగ్మెంట్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ Galaxy M సిరీస్ ఇదే రేంజ్ ధర ఉన్న యూజర్లను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి రానుంది. శాంసంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో 6GB + 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 15,999 ప్రారంభ ధరతో వస్తుంది. గెలాక్సీ M34 ధర ఎక్కువగా ఉండవచ్చు. ఈ డివైజ్ అమెజాన్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది.
Read Also : Apple iPhone 14 Price : అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇదే సరైన సమయం.. వెంటనే కొనేసుకోండి..!
శాంసంగ్ గెలాక్సీ M34 5G స్పెసిఫికేషన్లు (అంచనా) :
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ లీక్ డేటా ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ M34 5G సాధారణ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.6-అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుందని చెప్పవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరాతో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిజైన్‌ను చూడవచ్చు. రాబోయే 5G ఫోన్ హుడ్ కింద ఉన్న MediaTek Dimensity 1080 చిప్సెట్ నుంచి పవర్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ M34 సరికొత్త ఆండ్రాయిడ్ OS వెర్షన్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 14OS ఇంకా గూగుల్ రిలీజ్చేయలేదు. ఈ కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ 13OSతో రానుందని భావించవచ్చు.
ఫొటోగ్రఫీ సెషన్లు, వీడియోగ్రఫీ కోసం శాంసంగ్ గెలాక్సీ M34 వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంటుంది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP సెకండరీ కెమెరా, 5MP కెమెరా ఉండవచ్చు. సెల్ఫీలు, ఆన్లైన్ సమావేశాలకు కొత్త శాంసంగ్ ఫోన్ ఫ్రంట్ సైడ్ 13MP సెన్సార్‌ను కలిగి ఉండవచ్చని లీక్ పేర్కొంది.
హుడ్ కింద, కొత్త 5G ఫోన్ 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని టిప్‌స్టర్ చెప్పారు. ఈ బ్రాండ్ ఫోన్ బ్యాటరీ 6,000mAh యూనిట్‌ను అందించకపోవచ్చు. అయితే, అధికారికంగా కంపెనీఏది ధృవీకరించలేదు. శాంసంగ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ సపోర్టును అందించింది. కంపెనీ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందిస్తుందో లేదో ప్రస్తుతం తెలియదు.