Kl Rahul : కేఎల్ రాహుల్ వ‌ర్కౌట్లు .. ఇషాన్ కిష‌న్ కామెంట్ వైర‌ల్‌.. ‘మిస్ట‌ర్ ర‌జినీ ఎందుకు అంత ఎక్స్ ట్రా..’

టీమ్ ఇండియా ఆట‌గాడు, లక్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) గాయ‌ప‌డ‌డంతో ఐపీఎల్ 2023 సీజ‌న్‌ మ‌ధ్య‌లోనే  వెదొలిగిన సంగ‌తి తెలిసిందే.

Kl Rahul : కేఎల్ రాహుల్ వ‌ర్కౌట్లు .. ఇషాన్ కిష‌న్ కామెంట్ వైర‌ల్‌.. ‘మిస్ట‌ర్ ర‌జినీ ఎందుకు అంత ఎక్స్ ట్రా..’

Ishan Kishan-Kl Rahul

KL Rahul-Ishan Kishan : టీమ్ ఇండియా ఆట‌గాడు, లక్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) గాయ‌ప‌డ‌డంతో ఐపీఎల్ 2023 సీజ‌న్‌ మ‌ధ్య‌లోనే  వెదొలిగిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఐపీఎల్ మిగ‌తా టోర్నీతో పాటు లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్(WTC Final) మ్యాచ్‌కు దూరం అయ్యాడు. త‌న గాయానికి జ‌ర్మ‌నీకి వెళ్లి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. బెంగ‌ళూరుకు చేరుకున్న రాహుల్ ప్ర‌స్తుతం నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(National Cricket Academy) లో ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్నాడు.

India tour of West Indies : వెస్టిండీస్ క‌ష్టాలు.. టెస్టు సిరీస్‌ను రీ షెడ్యూల్ చేస్తారా..?

ఇందుకోసం జిమ్‌లో తీవ్రంగా వ‌ర్క‌ట్లు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు. త్వ‌ర‌గా కోలుకుని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాల‌ని ప‌లువురు అభిమానులు కామెంట్లు పెట్టారు. అయితే.. స‌హ‌చ‌ర టీమ్ఇండియా ఆట‌గాడు, వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ స‌ర‌దాగా రాహుల్‌ని టీజ్ చేశాడు. ‘మిస్ట‌ర్ ర‌జ‌నీ ఎందుకు ఇంత అంత ఎక్స్ ట్రా చేస్తున్నావ్’ అని కామెంట్ చేశాడు.

India tour of West Indies : టెస్టు సిరీస్‌కు రోహిత్, కోహ్లితో పాటు సీనియ‌ర్ల‌కు విశ్రాంతి..? కెప్టెన్‌గా అజింక్య ర‌హానె..?

ఐపీఎల్ మ‌ధ్య‌లో కేఎల్ రాహుల్ గాయ‌ప‌డ‌డంతో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ కోసం రాహుల్ స్థానంలో ఇషాన్ కిష‌న్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే.. తుది జ‌ట్టులో ఆడే అవ‌కాశం మాత్రం అత‌డికి ద‌క్క‌లేదు. త్వ‌ర‌లో వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఎన్‌సీఏలో త‌న బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగుప‌ర‌చుకునే ప‌నిలో ఉన్నాడు. విండీస్ ప‌ర్య‌ట‌న‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించాల‌ని భావిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by KL Rahul👑 (@klrahul)

ICC Test Rankings : టాప్‌-10 బ్యాట‌ర్లు, బౌల‌ర్లు వీరే.. విరాట్ కోహ్లి ర్యాంక్ ఎంతంటే..?

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20లు ఆడ‌నుంది. జూలై 12 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. వ‌న్డే సిరీస్ జూలై 27, టీ20 సిరీస్ ఆగ‌స్టు 3న ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌లో ప‌ర్య‌టించే భార‌త జట్టును ఈ నెల 27 ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. టెస్టు సిరీస్‌కు సీనియ‌ర్ ఆట‌గాళ్లు అయిన విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ల‌కు విశ్రాంతి నిచ్చే అవ‌కాశాలు ఉన్నాయి.