Anil Kumar Yadav: పులికేసి పాదయాత్రలో మంగళవారం మాటలు.. లోకేష్ యాత్రపై అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు

లోకేష్ సిల్లీ బచ్చా, ఆఫ్ టికెట్ లోకేష్‭కి మాట్లాడటం కూడా రాదు. మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనీ చేసిన వారందరూ బేసిక్ నాలెడ్జ్ లేని లోకేష్ వెంట తిరుగుతున్నారు. తన కొడుకు అక్షరాబ్యాసం రోజు కూడా తప్పులు రాసే సిల్లీ ఫెలో లోకేష్

Anil Kumar Yadav: పులికేసి పాదయాత్రలో మంగళవారం మాటలు.. లోకేష్ యాత్రపై అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు

Anil Kumar Yadav – Lokesh: తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యాత్రలో భాగంగా లోకేష్ చేస్తున్న ప్రసంగాలను, హామీలను మంగళవారం మాటలు అని, యాత్రను పులికేసి పాదయాత్ర అంటూ విమర్శలు గుప్పించారు. లోకేష్‭కి మాట్లాడటం రాదని, ఆఫ్ టికెట్-సిల్లీ బచ్చా అంటూ అనిల్ ఎద్దేవా చేశారు.

MLA Shakeel : దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి వెనక నుండి కాదు.. అసదుద్దీన్ కి ఎమ్మెల్యే షకీల్ సవాల్

శుక్రవారం నెల్లూరు జిల్లాలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో అనిల్ మాట్లాడుతూ ‘‘మాట్లాడటం చేతగాని లోకేష్‭ని చూసి టీడీపీ నేతలే చీదరించుకుంటున్నారు. మగాడిలా నేను విసిరే సవాల్‭ని స్వీకరించే దమ్ము లోకేష్‭కి లేదు. పులికేసి పాదయాత్రలో మంగళవారం మాటలు మాట్లాడుతున్నారు. సీఎం వైఎస్ జగన్‭తో నేను భేటీ కావడంపై కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు బాత్ రూంలో ఉండి విన్నట్టే చెబుతున్నారు’’ అని అన్నారు.

Shah criticize Rahul: మోదీకి 20 సార్లు ఫెయిల్ అయిన రాహుల్ గాంధీ పోటీయేంటి? అమిత్ షా సెటైర్లు

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘లోకేష్ సిల్లీ బచ్చా, ఆఫ్ టికెట్ లోకేష్‭కి మాట్లాడటం కూడా రాదు. మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనీ చేసిన వారందరూ బేసిక్ నాలెడ్జ్ లేని లోకేష్ వెంట తిరుగుతున్నారు. తన కొడుకు అక్షరాబ్యాసం రోజు కూడా తప్పులు రాసే సిల్లీ ఫెలో లోకేష్. రూ.150 నుంచి రూ.200 కోట్లు ఖర్చు పెట్టి నా మీద గెలవాలని చూస్తున్నారు. నేను బలమైన అభ్యర్థిని కాబట్టే మాజీ మంత్రి నారాయణని నా మీద పోటీకి దించుతున్నారు. 2024లో ఎవరికి ఎవరు బుల్లెట్ దింపుతారో ప్రజలే డిసైడ్ చేస్తారు’’ అని మాజీ మంత్రి అనిల్ అన్నారు.