Devil Glimpse : కళ్యాణ్ రామ్ డెవిల్ గ్లింప్స్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా డెవిల్(Devil). నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
![Devil Glimpse : కళ్యాణ్ రామ్ డెవిల్ గ్లింప్స్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్ Devil Glimpse : కళ్యాణ్ రామ్ డెవిల్ గ్లింప్స్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్](https://10tv.in/wp-content/uploads/2023/07/Kalyan-Ram-Devil.jpg)
Kalyan Ram Devil
Kalyan Ram Devil Glimpse : నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా డెవిల్(Devil). నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయికగా నటిస్తోండగా.. సరికొత్త లుక్‌లో కళ్యాణ్ రామ్ కనిపిస్తుండడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ని ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను ఎప్పుడు విడుదల చేయనున్నారు అనే విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జూలై 5న ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పేశారు. ఈ గ్లింప్స్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Bigg Boss OTT 2 : అతడే కాదు.. ఎవరు ఉన్నా సరే లిప్‌లాక్ ఇచ్చేదాన్ని
Get a glimpse into the world of a fearless British secret agent on a mission to unravel a dark mystery!#DevilGlimpseonJuly5th 🔥#Devil @NANDAMURIKALYAN @iamsamyuktha_
A Film by ABHISHEK PICTURES @NaveenMedaram @soundar16 @SrikanthVissa @rameemusic @AbhishekPicture pic.twitter.com/jLDoRNrJ14
— ABHISHEK PICTURES (@AbhishekPicture) July 4, 2023
O Saathiya : సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికెట్ తెచ్చుకున్న ఓ సాథియా.. జూలై 7న గ్రాండ్‌గా విడుదల
హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాకాలు చేస్తోంది.